క్రైమ్/లీగల్

డాలర్ల మార్పిడి పేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 11: అమెరికన్ డాలర్ల మార్పిడి పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను నెల్లూరు క్రైం బ్రాంచ్, కోవూరు పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను క్రైం బ్రాంచ్ డిఎస్పీ ఎం.బాలసుందరరావు గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. ఢిల్లీకి చెందిన మహ్మద్ జబ్బార్, సిరాజుల్, రిదామ్ ఖాన్ అనే ముగ్గురు యువకులు ముఠాగా ఏర్పడి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ హిందీ భాష తెలిసిన వారిని లక్ష్యంగా చేసుకుని తమ వద్ద అమెరికన్ డాలర్లు ఉన్నాయని, దేశీయ కరెన్సీ ఇస్తే అంతకు అదనంగా అమెరికన్ డాలర్లు ఇస్తామంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుల దేశీయ కరెన్సీని తీసుకొని, వారికి సబ్బు కవర్లు చుట్టి గుడ్డ మూటలో పెట్టి, ఇంతలోనే పోలీసులు వస్తున్నారని ఇంటికెళ్లి చూసుకోమని పంపించి వేస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం స్థానిక రంగనాయకులపేటకు చెందిన షేక్ హైదర్ అలీకి ఇదే తరహాలో డాలర్లు ఇస్తామని ఆశ చూపి కోవూరుకు రమ్మని పిలిచారు. అక్కడకు రూ.50వేల నగదు తీసుకెళ్లిన హైదర్ అలీ చేతిలో పైన పేర్కొన్న రీతిలోనే సబ్బుకవర్లు చుట్టిన మూటను ఉంచి మోసగించారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో క్రైం డిఎస్పీ బాలసుందరరావు పర్యవేక్షణలో సిఐ బాజీజాన్ సైదా, ఎస్సై షేక్ షరీఫ్, కోవూరు ఎస్సై ఎ.వెంకట్రావు తమ సిబ్బందితో నిఘా ఏర్పాటుచేసి గురువారం కోవూరు పరిధిలోని సాలుచింతల వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.50వేలు నగదు, 20 అమెరికన్ డాలర్ల మూడు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన క్రైం బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథం, కోవూరు హెడ్ కానిస్టేబుల్ అద్దంకి వెంకటేశ్వర్లు కానిస్టేబుళ్లు విజయప్రసాద్, నరేష్, సుబ్బారావు, అరుణ్‌కుమార్‌లను అభినందించిన డిఎస్పీ వారికి రివార్డుల కోసం సిఫార్సు చేశారు.