క్రైమ్/లీగల్

పోలీసు వాహనం ఢీకొన్న వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 12: మండలంలోని రాఘవాపర్ గ్రామ పంచాయితీ పరిధిలోని గొల్లపల్లి వద్ద రాజీవ్ రహదారిపై గత 25 రోజుల కిందట బసంత్‌నగర్ పోలీసు స్టేషన్ వాహనం ఢీకొని లక్ష్మీనారాయణ (45) తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని అదే వాహనంలో పెద్దపల్లి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ శుక్రవారం మరణించాడు. లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గొల్లపల్లి గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం రాస్తారోకో చేశారు. బసంత్‌నగర్ ఎస్సై రాజ్‌కుమార్ ఉన్న పోలీసు వాహనం ఢీకొని లక్ష్మీనారాయణ మరణించాడని, ఎస్సైపై తగిన చర్య తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి సీ ఐ గోపతి నరేందర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేయడానికి ప్రయత్నించారు. చివరగా మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించడానికి అంగీకారం లభించడంతో గొల్లపల్లి గ్రామస్తులు ఆందోళన విరమించుకున్నారు.