క్రైమ్/లీగల్

పోలీసుల అదుపులో నలుగురు గిరిజనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అదుపులో ఉన్న వారిలో ముగ్గురు మైనర్ బాలికలు
* అడ్డుకున్న గిరిజనులు-చితకబాదిన పోలీసులు
* గాలిలోకి కాల్పులు
-----------------------------------------------------------------------------
పెదబయలు, అక్టోబర్ 12: ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దు ప్రాంతమైన ఆండ్రపల్లి గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు మైనర్ బాలికలు ఉండడం విశేషం. అయితే తమ వారిని పోలీసులు అదుపులోకి తీసుకుకోవడంపై ఆగ్రహించిన గిరిజనులు తిరుగుబాటు చేసి పోలీసులను నిలువరించే ప్రయత్నం చేసారు. దీంతో కోపోద్రికులైన పోలీసులు గిరిజనులపై జులుం ప్రదర్శించడమే కాకుండా గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. దీంతో మారుమూల ప్రాంతమైన ఆండ్రపల్లి గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం ఎ.ఒ.బి.లోని ఆండ్రపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ ఘటనలో మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఈ ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు ఆండ్రపల్లి గ్రామంలోకి ప్రవేశించి గిరిజనుల ఇళ్లను సోదా చేసారు. గ్రామంలోని ప్రతి గిరిజనుడి ఇంటిని సోదా చేయడమే కాకుండా ఇళ్లలోని వస్తువులను బైటకు విసిరేసి, తమను చితకబాదినట్టు ఈ గ్రామ గిరిజనులు విలేఖరుల ఎదుట వాపోయారు. ఇదిలాఉండగా ఆండ్రపల్లి గ్రామానికి చెందిన కొర్రా రాజేష్ అనే యువకుడితో పాటు మరో ముగ్గురు మైనర్ బాలికలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారితో తీసుకువెళ్లారు. అయితే వీరిని పోలీసులు తీసుకువెళుతుండగా ఆండ్రపల్లి, పనసపుట్టు, జోడం గ్రామాలకు చెందిన గిరిజనులు గొర్రచెట్టు జంక్షన్ వద్ద ఆడ్డుతగిలి తమ వారిని ఎందుకు తీసుకువెళుతున్నారని నిలదీసి అడ్డుతగిలినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు మరోసారి వారిని చితకబాదడమే కాకుండా గాలిలోకి కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. అనంతరం ఎన్‌కౌంటర్ సంఘటన స్థలానికి వెళుతున్న విలేకరులను గిరిజనులు గొర్రచెట్టు జంక్షన్ వద్ద దాదాపు గంట సేపు నిర్భధించి తమ గ్రామంలోకి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఆంధ్రకు చెందిన పోలీసులు తమ గ్రామంలోకి చొరబడి నానా భీబత్సం సృష్టిస్తున్నారని, మావోయిస్టులతో తమకు సంబంధాలను అంటగట్టి నిర్భందానికి గురిచేస్తున్నారని వారు వాపోయారు. అయితే విలేకరులు గిరిజనులకు నచ్చచెప్పడంతో నిర్భంధం నుంచి విడుదల చేసి తమ గోడును వెల్లగక్కారు. తమ గ్రామానికి చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఇందులో రాజేష్ అనే యువకుడుతో పాటు మరో ముగ్గురు బాలికలు ఉన్నట్టు చెప్పారు. పోలీసుల అదుపులో ఉన్న రాజేష్ మావోయిస్టు కాదని, తమ గ్రామంలోనే వ్యవసాయ పనులు చేసుకుని జీవిస్తున్నాడని వారు పేర్కొన్నారు. ఈ మేరకు రాజేష్ ఆధార్ కార్డును ఆయన భార్య జ్యోతి విలేకరులకు చూపించింది. కాగా పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు బాలికలు పక్కనే ఉన్న జంత్రి గ్రామానికి చెందిన వారని, బంధువుల ఇంటికని గురువారం తమ గ్రామానికి వచ్చారని వారు చెప్పారు. పోలీసుల చర్యలతో తాము నిరంతరం భయాందోళనతో జీవించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. పోలీసుల అదుపులో ఉన్న తమ వారిని తక్షణమే విడిచిపెట్టాలని, తమకు రక్షణ కల్పించాలని, పోలీసు దాడుల నుంచి తమను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.