క్రైమ్/లీగల్

యువకుడి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డీ.హీరేహాల్, అక్టోబర్ 12 : మండల కేంద్రానికి చెందిన కురుబ సందీప్ (23) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్థులు బంధువులు ఆరోపించారు. డీ.హీరేహాల్‌కు చెందిన కురుబ సందీప్ గ్రామ సమీపంలో ఉన్న సాయి సుధీర్ ఉక్కు పరిశ్రమలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. అయితే పరిశ్రమలో క్యాంటీన్ నడుపుతున్న బళ్లారికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో వివాహిత భర్తకు, సందీప్‌కు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సందీప్ మాములుగానే పనికి వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వచ్చాడని తెలిపారు. అయితే మరుసటి రోజు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి ఎర్రిస్వామితోపాటు బంధువులు చుట్టు ప్రదేశాల్లో పరిశీలించారు. చివరకు బళ్లారిలోని బండిహట్టి ప్రాంతంలో సందీప్ ద్విచక్రవాహనం లభ్యమైంది. దాని ఆధారంగా చుట్టు పక్కల కాలనీ వాసులను వివరాలు అడిగినా తెలియదని సమాచారం ఇచ్చారన్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం మండలంలోని చెర్లోపల్లి, మైలాపురం మధ్య హెచ్చెల్సీలో శవం ఉన్నట్లు తెలిస్తే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా సందీప్ మృతదేహంగా గుర్తించామన్నారు. తన కొడుకును బళ్లారికి చెందిన వారే హత్య చేసి కాలువలోకి వేశారని మృతుని తండ్రి ఎర్రిస్వామి, బంధువులు ఆరోపించారు. శవాన్ని రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి

రొళ్ల, అక్టోబర్ 12 : మండల పరిధిలోని గుడ్డుగుర్కికి చెందిన డ్రైవర్ రామాంజి (27) ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం అటవీ ప్రాంతంలో ఇసుక నింపుకుని ట్రాక్టర్‌లో వస్తుండగా మార్గమధ్యలో గుంత నుంచిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఇంజన్ పైకి లేవడంతో రామాంజి చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య అనిత ఐదు నెలల గర్భవతి. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సిలిండర్ల పట్టివేత * కల్లూరు ఆర్‌ఎస్‌లో ఓ ఇంటిపై అధికారుల దాడి

అనంతపురం, అక్టోబర్ 12 : ఎల్‌పీజీ సిలిండర్లను వినియోగదారుల నుంచి సేకరించి అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కల్లూరు ఆర్‌ఎస్‌లోని ఓ ఇంటిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ మెట్రాలజీ, స్థానిక రెవెన్యూ అధికారులు సంయుక్తంగా శుక్రవారం ఆకస్మికంగా దాడి చేసింది. ఈ సందర్భంగా మొత్తం 21 వాణిజ్య, గృహావసరాల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారి జీ.రామాంజనేయులుకు వచ్చిన సమాచారం నేపథ్యంలో కల్లూరు ఆర్ ఎస్‌లోని 7-111 ఇంటిని తనిఖీ చేశారు. ఇంటి యజమాని షేక్షావలి తన ఇంటిలో గృహావసరాలకు వాడే 14.5 కిలోలున్న 11 ఇండేన్, రెండు భారత్, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19.3 కిలోలున్న 4 ఇండేన్ గ్యాస్, ఒక భారత్ గ్యాస్ సిలిండర్లు, వీటితో పాటు 5 కేజీలున్న మూడు చిన్న భారత్ గ్యాస్ సిలిండర్లు ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. తాను కొంతమంది వద్ద తక్కువ ధరకు కొని ఆటోలు, ఇంటి అవసరాలకు కావాల్సిన వారికి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నట్లు షేక్షావలి సమాధానం చెప్పినట్లు అధికారులు తెలిపారు. వెంటనే గ్యాస్ సిలిండర్లు జప్తు చేసి ఏపీ నిత్యావసర వస్తువులు చట్టం, 1955 మేరకు తదుపరి చర్యల నిమిత్తం స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. తనిఖీలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీసీటీఓ సుబ్బారెడ్డి, ఎస్ ఐ శంకర్, కానిస్టేబుల్ ధనుంజయ, హెడ్‌గార్డ్ అశోక్, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ శంకర్, స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మునీంద్ర, వీఆర్‌ఓ శంకరనారాయణ పాల్గొన్నారు.