క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, అక్టోబర్ 12: జిల్లాలోని ఘణపురం మండలం కర్కపల్లికి చెందిన ఎనిమిదేళ్ల్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం సదరు బాలిక తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళిన సమయంలో బాలికకు ఇంటి సమీపంలోని ఓ యువకుడు మాయమాటలు చెప్పి, అతని ఇంటికి తీసుకువెళ్ళి అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. పోలీసు లు యువకుడిని అతని ఇంటి వద్దే అదుపులోకి తీసుకొన్నట్లు సమాచా రం. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా వారు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

అవినీతి నిర్మూలనకే స.హ చట్టం
పరకాల, అక్టోబర్ 12: పాలనలో పారదర్శకతను పెంచి అవినీతిని నిర్మూలించే సహ చట్టం అమలులోకి వచ్చి 13 సంవత్సరాలు అవుతున్న గ్రామ, మండల స్థాయిలలో సక్రమంగా అమలుకావడం లేదని సమాచార హక్కు చట్టం రక్షణ వేధిక ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ కామిడి సతీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సమాచార హక్కు చట్టం 13వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కామిడి సతీష్‌రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధమని.. రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడం వల్ల రాష్ట్ర కార్యాలయం వెళ్లే ద్వితీయ అప్పిల్స్ వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉండడం వల్ల దరఖాస్తుదారులకు న్యాయం జరగడం లేదన్నారు. ప్రజా సమాచార అధికారులకు అవగాహన లేకపోవడం మూలాన సహ చట్టం నిర్వీర్యం అవుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు దరిచేరేలా, అవినీతి లేకుండా సాగేలా సహ చట్టం దోహదం చేస్తుందన్నారు. సమావేశంలో డివిజన్ నాయకులు రాజేష్, చర్లపల్లి వెంకటేశ్వర్లు, గడ్డం రమేష్, సదయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.