క్రైమ్/లీగల్

ద్వారకాతిరుమలలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, అక్టోబర్ 13: శ్రీవారి క్షేత్రంలో గుండెపోటుకు గురైన ఒక గుర్తుతెలియని వృద్ధుడు శనివారం మృతిచెందాడు. సుమారు 70 ఏళ్ల వయసున్న ఈ వృద్ధుని ఆచూకీ తెలియరాలేదు. స్థానికుల కథనం ప్రకారం.. దాదాపు రెండు నెలల క్రితం క్షేత్రానికి వచ్చిన ఈ వృద్ధుడు ఆలయ పరిసరాల్లోనే సంచరిస్తుండేవాడు. అనివేణి మండపంలో పురోహితుడు పెట్టేది తింటూ బతికేవాడు. అయితే శనివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో మండపం ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన దేవస్థానం సిబ్బంది హుటాహుటిన అంబులెన్స్‌లో స్థానిక పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే ఆ వృద్ధుడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే మృతునిది కొవ్వూరు అని, ఇతని పేరు ఆచారి అని పలువురు అంటున్నారు. కుటుంబ సభ్యుల చీదరింపులకు గురై తాను ఇక్కడకు వచ్చినట్టు వృద్ధుడు చెబుతుండేవాడని ఇక్కడి పురోహితులు చెబుతున్నారు.