క్రైమ్/లీగల్

ఆత్మకూరు కేశవరెడ్డి హత్య కేసు ఛేదింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, అక్టోబర్ 22: ఆత్మకూరు కేశవరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అనంతపురం డీఎస్పీ వెంకట్రావు తెలిపారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో కేశవరెడ్డికి హత్యకు సంబందించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కేశవరెడ్డి అన్న కొడుకేనని తెలిపారు. రెండు కుటుంబాల మధ్య గత కొనే్నళ్లుగా ఉన్న ఆస్తి తగాదాలు, ఇతర కారణాలు ఉండడంతోనే హత్యకు దారి తీసినట్లు తెలిపారు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన గూళి కేశవరెడ్డి (67) ఈ నెల హత్యకు గురయ్యాడని, ఈ కేసులో గూళి నరసింహారెడ్డి, సాకే వారాదప్ప, గూళి విశ్వనాథ్‌రెడ్డిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడు గూళి నరసింహారెడ్డి హతుడికి స్వయాన అన్న కొడుకేనని, ఈ రెండు కుటుంబాల మధ్య గత కొనే్నళ్లుగా ఆస్తి తగాదాలు ఉన్నాయని, వాటితోనే ఈ హత్యకు దారి తీసిందన్నారు. ఈ కేసును ఛేదించిన ఆత్మకూరు సీఐ ప్రసాద్‌రావు, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు శివ, బ్రహ్మయ్య, రమణ, నగేష్, రమేష్, వౌనేష్‌లు బృందాన్ని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, డీఎస్పీలు అభినందించారు.
వ్యక్తి ఆత్మహత్య
రామగిరి, అక్టోబర్ 22 : మండలంలోని ఎంసీ పల్లి గ్రామంలో కంసల వెంకటేష్ (39) ఉరి వేసుకుని సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి మధ్యం తాగి వచ్చి ఇంటిలో భార్యతో గొడవపడి ఈ సంఘటనకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటి నుంచి బయటికి వచ్చిన వెంకటేష్ సమీపంలోని చింత చెట్టుకు ఉరి వేసుకున్నాడు. తెల్లవారుజామున దీనిని గమనించిన గ్రామస్థులు వెంటనే అతని భార్య సరస్వతికి సమాచారం అందించి పోలీసులకు కూడా సమాచారాన్ని అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.