క్రైమ్/లీగల్

మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. గత ఆగస్టు 2వ తేదీతో గ్రామ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని గ్రామ మాజీ సర్పంచ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రజా స్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుబడిందని హైకోర్టుకు విన్నవించారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినప్పటికి ఆలనాపాలనా లేకపోవడంతో గ్రామవ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని సర్పంచ్‌లు హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ పేర్కొన్నారు. గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం 90 జివోను తీసుకువచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ మాజీ సర్పంచ్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఆధ్వర్యంలో హైకోర్టు బెంచ్ మంగళవారం హైకోర్టు సర్పంచ్‌ల వ్యాజ్యాన్ని విచారించింది. ఇరువురి వాదనలను కోర్టు పరిశీలించింది. ఏపీ ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చుతూ సర్పంచ్ పిటిషన్లను సమర్థిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమం అయింది. కోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం వ్యవస్థ మరింత బలపడిందని పిటిషన్ దారులు పేర్కొన్నారు. 2013 మే, జూన్ నెలల్లో పంచాయతీలకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించగా 2013 ఆగస్టు 2వ తేదీ నుంచి పంచాయతీల్లో సర్పంచ్‌లు అధికార పగ్గాలు చేపట్టారు. గత ఆగస్టు 2వ తేదీతో వారి పదవీకాలం ముగిసింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా దాదాపు రెండేళ్ళు కాలయాపన చేస్తోందని ఆనాడు సర్పంచ్‌లు కోర్టు మెట్లు ఎక్కారు, హైకోర్టు చొరవతో అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కూడా సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినా ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టుతూ మూడు నెలల్లో గ్రామ సర్పంచ్ ఎన్నికల నిర్వహంచాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల తరఫున ఎం. రామకృష్ణారెడ్డి తమ వాదనలు వినిపించారు.
తక్షణం ఎన్నికలు నిర్వహించాలి
విజయవాడ: మూడు మాసాల్లోగా పంచాయతీ ఎన్నికలను
నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ఆదేశించడం పట్ల గ్రామాల్లో సర్వత్రా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ప్రత్యేకాధికారుల పాలనకు ఉద్దేశించిన జీవో 90 రద్దయినందున మాజీ సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమించి త్వరితగతిన పనులు జరిగేలా చూడాలని లోకల్ గవర్నమెంట్స్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. చేసిన పనులకు బిల్లులు రాక 12,920 పంచాయతీల్లో మాజీ సర్పంచ్‌లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. సకాలంలో ఎన్నికలు జరగనందున కేంద్ర నిధులు అందడం లేదన్నారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టులంటిదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించి ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కాలవ్యవధి ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలన తీసుకురావడం సరైన విధానం కాదని అన్నారు.