క్రైమ్/లీగల్

రాత్రి 8 నుంచి 10 వరకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దీపావళి సందర్భంగా బాణాసంచాపై ఆంక్షలను విధిస్తూ హరిత దీపావళి సాధన, కాలుష్య నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే బాణాసంచాను కాల్చాలని కోర్టు పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ ఏకె సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా బాణాసంచా విక్రయాలను నిషేధించింది. ఫ్లిప్‌కార్డ్, అమెజాన్ సంస్థలు బాణా సంచాలను విక్రయించడాన్ని అనుమతించేదిలేదని కోర్టు స్పష్టం చేసింది. బాణాసంచాను కాల్చడం వల్ల వెలువడే ధ్వని పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పేసో) నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి ఉండాలని కోర్టు పేర్కొంది. ప్రజలు సమష్టిగా ఒకచోట చేరి బాణా సంచాను కాల్చే పద్ధతిని ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు కోర్టు సూచించింది. నిషేధించిన బాణాసంచాను విక్రయించడం, కాల్చడం జరిగితే సంబంధిత పోలీసులను బాధ్యులను చేయాలని కోర్టు పేర్కొంది. బాణాసంచాను పూర్తిగా నిషేధించరాదని విక్రేతలు కోర్టును అభ్యర్థించారు.
వాతావరణ కాలుష్యం పెరిగేందుకు బాణాసంచా కారణం కాదని వారు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచాను కాల్చడాన్ని కోర్టు గత ఏడాది అక్టోబర్ 9న తాత్కాలికంగా నిషేధించింది.