క్రైమ్/లీగల్

పోలీసు కస్టడీకి సీబీఐ డీఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐ కేంద్ర కార్యాలయంలో డీఎస్పీగా పనిచేస్తున్న దేవేందర్ కుమార్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడురోజుల పోలీసుకస్టడీకి ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపై కూడా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. సీబీఐ డైరెక్టర్ ఆదేశాలపై సీబీఐ పోలీసులు డీఎస్పీ దేవేందర్ కుమార్‌ను అరెస్టుచేసీ ప్రత్యేక సీబీఐ న్యాయస్థానంలో మంగళవారం ప్రవేశపెట్టారు. దర్యాప్తు ముసుగులో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని దేవేందర్‌కుమార్‌పై సీబీఐ అభియోగం మోపింది. ఈకేసులో పూర్తి వివరాలను రాబట్టుకునేందుకు పదిరోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ జడ్జి సంతోష్ నేహి మాన్ జోక్యం చేసుకుని ఈ కేసులో వచ్చిన అభియోగాల తీవ్రత దృష్ట్యా పోలీసు కస్టడీకి ఏడు రోజుల పాటు నిందితుడు దేవేందర్ కుమార్‌ను అప్పగించడం అవసరమని పేర్కొన్నారు. కాగా అంతకు ముందు ఢిల్లీ హైకోర్టుతనపైన, సీనియర్ అస్థానాపైన నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని దేవేందర్ కుమార్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. కాగా ఈ కేసులో ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు హైకోర్టులో ఈనెలాఖరు వరకు ఊరట లభించిన విషయం విదితమే.
సీబీఐకోర్టులో సీబీఐ న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిందితుడి ఇంట్లో, కార్యాలయంలో సోదాలు నిర్వహించగా విలువైన డాక్యుమెంట్లు లభించాయన్నారు. కేసు దర్యాప్తులో తప్పుడు సాక్ష్యాలను రూపొందించి చెప్పడమే కాకుండా విచారణకు సహకరించడం లేదని కోర్టుకుతెలిపారు. ఈ కేసులో నిందితుడి తరఫున రాహుల్ త్యాగి వాదనలు వినిపించారు. చట్టవిరుద్ధంగా తన క్లైంట్‌ను అరెస్టు చేశారన్నారు. సెక్షన్ 17ఏ ఆఫ్ పీసీ కింద ముందస్తు అనుమతి లేకుండా అరేస్టుచేశారన్నారు. కాగా అటువంటి అనుమతి అవసరమని కోర్టు భావించడం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ తన క్లైంట్ సీబీఐ కేసును విచారిస్తున్నారని, ఈ కేసులోఫిర్యాదిదారుడు సతీష్ బాబు అనుమానితుడని, కొంత మంది పాత, కొత్త సీబీఐ అధికారుల పేర్లు కూడా వెలుగుచూశాయన్నారు. కాగా ఈ కేసులో నిందితుడు దేవేందర్ కుమార్‌పైన ఐపీసీ 384, ఐపీసీ 388, 389, ఫోర్జరీ ఐపీసీ 468, ఐపీసీ 471 కింద కేసులను నమోదు చేసినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసు రుజువైతే నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ కేసులో సానా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్టోబర్ 15వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ నమోదు చేసింది. ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న దేవేందర్ కుమార్ నిందితుడికి ఫోన్ చేసి రూ.5 కోట్ల లంచం ఇవ్వాలని, క్లీన్ చిట్ ఇస్తామని వేధిస్తున్నట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మొత్తం సొమ్ములోకొంత సొమ్మును విచారణాధికారిగా ఉన్న దేవందర్ కుమార్‌కు చెల్లించినట్లు ఫిర్యాదీదారుడు సీబీఐకు ఇచ్చిన సమాచారంలో తెలిపారు.