క్రైమ్/లీగల్

ఆరావళిలో 31 కొండలు మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: రాజస్తాన్‌లో ఆరావళి పర్వతాల్లో 31 కొండలు అదృశ్యం కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తక్షణమే 48 గంటల్లోగా కొండల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించంది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో 115.34 హెక్టార్ల పరిధిలో అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని కోర్టు పేర్కొంది. రాజస్తాన్ ప్రభుత్వానికి సాలీనా మైనింగ్ వల్ల రూ.5వేల కోట్ల ఆదాయం వస్తోంది. కాని ఎడాపెడా మైనంగ్ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడం వల్ల కొండలను తవ్వుతున్నారు. దీని వల్ల కాలుష్యం పెరుగుతోంది. కొండలు అదృశ్యమవుతున్నాయి. జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో కాలుష్య పరిమితులు విపరీతంగా పెరగడానికి ఆరావళి ప్రాంతంలో అక్రమ మైనింగ్ కూడా కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఆదేశాలను జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం జారీ చేసింది. ఈ సందర్భంగా రాజస్తాన్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను కోర్టు పరిశీలించింది. 115.34 హెక్టార్లలో మైనింగ్ జరుగుతున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆరావళి ప్రాంతాల్లో అటవీ సర్వే ఆఫ్ ఇండియా 128 చోట్ల శాంపిల్స్‌నుసేకరించింది. ఇందులో 31 చోట్ల కొండలు అదృశ్యమైనట్లు ఈ సంస్థ నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా జస్టిస్ లోకూర్ జోక్యం చేసుకుని కొండలు ఎలా మాయమవుతున్నాయి ? ప్రజలు హనుమాన్‌గా మారి కొండలను ఎత్తుకెళుతున్నారా ? అక్రమ మైనింగ్‌ను అనుమతించేది లేదు అని హెచ్చరించారు. ఆరావళి ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాజస్తాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్‌ను ఇవ్వాలని, ఈ కేసును ఈ నెల 29వ తేదీన విచారిస్తామని కోర్టు పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన స్టేటస్ నివేదికతో తాము సంతృప్తి చెందలేదని కోర్టు పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం అక్రమమైనింగ్‌ను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని రాజస్తాన్ తరఫున న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. బాధ్యులైన వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఎఫ్‌ఐఆర్‌లను కూడా నమోదు చేశానని ఆయన బదులిచ్చారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని పర్వతాలను భగవంతుడు సృష్టించారని, వీటిని తొలగించడం వల్ల కాలుష్యం ముప్పు పెరుగుతుందని పేర్కొంది. ఢిల్లీలో కాలుష్యం వ్యాప్తి చెందుతోందని, దీనికి కూడా ఆరావళి పర్వత సానువుల్లో అక్రమ మైనింగ్ కారణమని కోర్టు తెలిపింది.