క్రైమ్/లీగల్

అది చట్ట వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 24: కోరేగాంవ్ భీమా అల్లర్ల కేసులో పుణే కోర్టు జారీ చేసిన ఆదేశాలను బొంబాయి హైకోర్టు బుధవారం కొట్టివేసింది. కోరేగాంవ్ భీమా గ్రామంలో చోటు చేసుకున్న హింసకు సంబంధించిన కేసులో అరెస్టయిన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ఇతర సామాజిక కార్యకర్తలకు వ్యతిరేకంగా చార్జిషీట్ దాఖలు చేయడానికి పోలీసులకు అదనపు సమయం ఇస్తూ పుణే కోర్టు జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది. కోరేగాంవ్ భీమా కేసులో చార్జిషీట్ దాఖలు చేయడానికి పోలీసులకు అదనంగా 90 రోజుల గడువు ఇవ్వడం, ఫలితంగా గాడ్లింగ్, ఇతరుల కస్టడీని పొడిగించడం ‘చట్టవ్యతిరేకం’ అని బొంబాయి హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ మృదుల భట్కర్ పేర్కొన్నారు. జస్టిస్ భట్కర్ తీర్పుతో ఈ కేసులో గాడ్లింగ్, ఇతరులకు బెయిల్ పొందడానికి మార్గం ఏర్పడింది. అయితే, జస్టిస్ భట్కర్ తాను ఇచ్చిన తీర్పు నవంబర్ ఒకటో తేదీ వరకు అమలు కాకుండా తానే స్టే మంజూరు చేశారు. సుప్రీంకోర్టులో అప్పీలు చేయడానికి సమయం కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి తన తీర్పు అమలుపై స్టే మంజూరు చేశారు. పుణే పోలీసులు ఈ కేసులో గాడ్లింగ్‌తో పాటు నాగ్‌పూర్ యూనివర్సిటి ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ అధిపతి షోమా సేన్, దళిత కార్యకర్త సుధీర్ ధావలే, సామాజిక కార్యకర్త మహేశ్ రౌత్, కేరళ వాసి రోనా విల్సన్‌ను ఈ సంవత్సరం జూన్‌లో అరెస్టు చేశారు. వారికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని అభియోగం మోపుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు. పుణే జిల్లాలో గల కోరేగాంవ్ భీమా గ్రామంలో అలనాడు జరిగిన సమరాన్ని స్మరిస్తూ జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించి పోలీసులు గత సంవత్సరం డిసెంబర్ 31న వారి ఇళ్లపై దాడులు చేశారు. అనంతరం వారిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో తన కస్టడీని కొనసాగించడం, తనకు బెయిల్‌ను నిరాకరించడం చట్టవ్యతిరేకం అని ఆరోపిస్తూ గాడ్లింగ్ ఈ నెల మొదట్లో బొంబాయి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు నిబంధనలు పాటించక పోవడం, చార్జిషీట్ దాఖలుకు అదనపు సమయం ఇవ్వాలని కోరడం వంటివి తనతో పాటు ఇతరుల కస్టడీ అక్రమమని నిరూపిస్తున్నాయని గాడ్లింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఏపీఏ)లోని నిబంధనల ప్రకారం ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పటి నుంచి 90 రోజులలోగా ఆ వ్యక్తిపై చార్జిషీట్‌ను దాఖలు చేయవలసి ఉంటుంది.