క్రైమ్/లీగల్

అలోక్‌వర్మ పిటిషన్‌పై 26న విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: కేంద్రం ముందస్తుగా ఎటువంటి సమాచారం లేకుండా చట్టవిరుద్ధంగా రాత్రికిరాత్రి తన అధికారాలకు కత్తెర వేసి, సెలలవుపై వెళ్లాలని ఆదేశించడం సహేతుకం కాదని సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ సుప్రీంకోర్టుకు తెలిపారు. స్వయంప్రతిపత్తి ఉన్న సీబీఐ సంస్థ అధికారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందని, ఇది అవాంచనీయ పరిణామమని ఆయన కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్రం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ జోక్యం చేసుకోవడం అంటే రాజ్యాంగ బద్ధమైన దర్యాప్తు ఏజన్సీ అధికారాలను నిర్వీర్యం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను ఈ నెల 26వ తేదీన విచారించేందుకు సుప్రీంకోర్టు సమ్మతించింది. తనను సెలవుపై బలవంతంగా వెళ్లాలని ప్రభుత్వం, సీవీసీ తీసుకున్న నిర్ణయాన్ని అలోక్‌వర్మ సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర వ్యక్తిగత, శిక్షణ మంత్రిత్వ శాఖ పరిధి నుంచి సీబీఐను తప్పించాలని, ఈ సంస్థ స్వయంప్రతిపత్తిని కాపాడాలని ఆయన కోరారు. ప్రభుత్వ చర్యల వల్ల సీబీఐపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. సీబీఐ పూర్తిస్థాయిలో స్వతంత్రంగా పనిచేయాల్సి ఉందన్నారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం వద్ద అలోక్ వర్మ తరపున న్యాయవాది గోపాల శంకర నారాయణన్ దాఖలు చేశారు. సీబీఐ డైరెక్టర్‌గా ఎంనాగేశ్వరరావును నియమించడాన్ని కూడా అలోక్ వర్మ సవాలు చేశారు. 1986 ఒడిశా ఐపీఎస్ బ్యాచికి చెందిన మనె్నం నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా కేంద్రం నియమించిన సంగతి విదితమే. స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానాపై అభియోగాలపై తాను విచారణకు ఆదేశించానని ఆయన కోర్టుకు తెలిపారు. తనకు తన శాఖలో పనిచేస్తున్న అధికారుల పట్ల సంపూర్ణ నమ్మకం ఉందని ఆయన చెప్పారు. బయటి శక్తుల జోక్యం వల్ల సీబీఐ పనితీరు మందగిస్తుందన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అనేక సున్నిత కేసులు దర్యాప్తులో ఉన్నాయని, వీటి గురించి ఇప్పటికిప్పుడు తాను సమాచారం ఇవ్వలేనని కోర్టుకు చెప్పారు. ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద డైరెక్టర్ పదవిలో చట్టబద్ధంగా నియమితులైన వ్యక్తి రెండేళ్ల పాటు అధికారంలో ఉంటారన్నారు. కాని ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి తనను సెలవుపై పంపించిందన్నారు. తనపై సెంట్రల్ విజిలెన్స్‌కమిషన్ అక్టోబర్ 23వ తేదీన ఇచ్చిన మూడు ఉత్తర్వులను కొట్టివేయాలన్నారు. రాజ్యాంగంలోని అధికరణలు 14,19, 21కు విరుద్ధంగా సీవీసీ నడుచుకుందన్నారు. న్యాయపోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.