క్రైమ్/లీగల్

పన్ను నిర్థారణ కోసం అప్పిలేట్ అథారిటీకి అప్పీలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 24: సవరించిన అమ్మకపుపన్నును నిర్ధారించుకునేందుకు అప్పిలేట్ అథారిటీకి అప్పీలు చేసుకోవాల్సిందిగా చెన్నై హైకోర్టు కార్ల కంపెనీ నిస్సాన్‌ను ఆదేశించింది. అంతర్రాష్ట్ర విక్రయాలకు సంబంధించి కేంద్ర అమ్మకపు పన్ను చట్టం ప్రకారం విధించిన సవరించిన పన్ను (టాక్స్ అసెస్‌మెంట్‌ను) నిస్సాన్ సంస్ధ హైకోర్టులో సవాలు చేయగా, ఈ విషయంలో నేరుగా రిట్ పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేయడం సరికాదని, చట్టప్రకారం అప్పిలేట్ అథారిటీకే అప్పీలుకు వెళ్లాలని న్యాయమూర్తి జస్టిస్ కె. రవిచంద్రబాబు ఆదేశించారు. నిర్థారిత పద్ధతిలో రాని ఇలాంటి పిటిషన్లను అంగీకరిస్తే రాజ్యాంగంలోని 226వ అధికరణంలో పేర్కొన్న విధంగా ఈ తరహా పిటిషన్లు కోర్టుకు వెలువెత్తుతాయని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇలావుండగా తమిళనాడుకు చెందిన సేల్స్‌ట్యాక్స్ లార్జ్ ట్యాక్స్ పేయర్స్ విభాగానికి డిప్యూటీ కమిషనర్ ఆదేశాలను 2017 జూలై 28న నిస్సాన్ కంపెనీ కోర్టులో సవాలు చేసింది. ఈ యేడాదికి తమకు విధించిన సవరించిన అమ్మకపుపన్ను అసెస్‌మెంట్ సక్రమంగా లేదని పిటిషనర్ వాదించారు. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాలతో పోల్చిన పిటిషనర్ తొలుత ఆంధ్ర, తెలంగాణల్లో మాత్రమే తమ కంపెనీ కార్లను తొలివిడతగా అమ్మకాలు జరిపామని. తమిళనాడులో అమ్మకాలు రెండోదఫాగా చేపట్టిందిగా పిటిషనర్ స్పష్టం చేశారు.