క్రైమ్/లీగల్

నిబంధనలకు విరుద్ధంగా టపాసుల వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, అక్టోబర్ 24: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని పోలీస్ స్టేషన్‌కు కూతపెట్టు దూరంలో ఎలాంటి అనుమతులు లేకుండా లక్షల రూపాయల విలువ చేసే ప్రమాదకరమైన టపాసులను నిల్వ చేసి వ్యాపారం సాగిస్తున్న దుకాణంపై బుధవారం సాయంత్రం ఎస్‌వోటీ పోలీసులు అకస్మికంగా దాడులు నిర్వహించారు. దుకాణంలో ఉన్న నిల్వలను తనిఖీ చేసి సుమారు పది లక్షల రూపాయల విలువ చేసే టపాసులు ఉన్నట్లు గుర్తించారు. వరంగల్‌లో జరిగిన ఘటనతో అప్రమత్తమై దాడులు చేసినట్లు ఎస్‌వోటీ పోలీసు అధికారులు తెలిపారు. గట్టు రవికి చెందిన రెండు అంతస్థుల భవనంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎంతో కాలంగా టపాసుల వ్యాపారం సాగిస్తున్నారు. దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున టపాసులను నిల్వ చేసారు. ఈ విషయాన్ని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎస్‌వోటీ పోలీసులు స్పందించారు. ఎస్‌వోటీ పోలీసుల బృందం అకస్మికంగా దాడులు నిర్వహించారు. దుకాణంలో ప్రమాదకరమైన టపాసులు లభ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు. అతని వద్ద ఎలాంటి అనుమతులు లేవన్నారు. అక్రమంగా వ్యాపారం సాగిస్తున్నారని ఎస్‌వోటీ సీఐ రాజు, ఎస్‌ఐ లక్ష్మీనారాయణలు తెలిపారు. తనిఖీలో పట్టుబడిన రూ.10లక్షల టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

చిత్రం..దుకాణంలో ఉన్న నిల్వల తనిఖీ