క్రైమ్/లీగల్

మావోల కుట్ర భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్,అక్టోబర్ 24: మావోయిస్టుల ఆదేశాల మేరకు విధ్వంసం సృష్టించడానికి మావోలకు పేలుడు పదార్దాలు తీసుకువెళ్తున్న ఇద్దరు మావోయిస్టులను పోలీసులు పక్కా సమాచారంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామ సమీపంలో చాకచక్యంగా పట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి ఓఎస్‌డి కె. సురేష్‌కుమార్ బుధవారం పస్రా పోలీస్‌స్టేషన్‌లో ములుగు డిఎస్పీ విజయసారధితో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను మీడియాకు వివరించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు చెందిన మడవి సుఖుమతి అలియాస్ రత్న అలియాస్ మంజుల సీపీఐ మావోయిస్టుపార్టీలో ఆంద్రా, ఓరిస్సా ఏరియాలో ప్లాటూన్ సెక్షన్ డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తుందని తెలిపారు. అదేవిధంగా బీజాపూర్ జిల్లాలోలని నర్సాపూరం గ్రామానికి చెందిన తాటి అడుమా అలియాస్ ఉమేష్ అలియాస్ మహేష్ సైతం పామెడ దళంలో సభ్యులుగా చేరి అంచలంచెలుగా ఎదుగుతూ 2011లో నియంగిరి ఏరియా బదిలీ అయి 2015 డిసెంబర్‌లో కట్‌ఆప్ ఏరియాకు బదిలీ కాగా 2017లో ఏరియా కమిటీ మెంబర్‌గా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడని తెలిపారు. వీరిద్దరు మావోయిస్టుల ఆదేశానుసారం డిటొనేటర్లు, జిలెటిన్‌స్టిక్స్‌ను దళాలకు చేరవేస్తుండగా తాడ్వాయి పోలీసులు, సిఆర్‌పిఎఫ్ పోలీసులు కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరిద్దరి వద్ద నుండి పేలుడు పదార్థాలను గమనించి స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని తెలిపారు. కాగా వీరిద్దరు మావోయిస్టు పార్టీలో పనిచేస్తుండగా ఆంధ్ర, ఓరిస్సా సరిహద్దు జిల్లాలో మాంపా పోలీస్‌స్టేషన్, అన్నవరం, జి.మాడుగుల, విశాఖపట్నం రూరల్ ఏరియా పరిధిలో జరిగిన అనేక సంఘటనలో ఇద్దరు నిందితులుగా ఉన్నారని ఆయన తెలిపారు. అంతేకాక 2013 జులైలో పోతరాజు గుమాల ఏరియాలో ఎదురుకాల్పుల సంఘటనలో, 2014 ఫిబ్రవరిలో అన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాళ్లగడ్డ గ్రామం బలపం సర్పంచ్‌ను హత్యచేసిన సంఘటనలో, 2017లో రాళ్లగడ్డ దగ్గరలో జీపును పేల్చివేసి హోంగార్డు చనిపోయిన ఘటనలో వీరిద్దరు పాల్గొన్నారని ఆయన వివరించారు.
ఆంధ్రాలో వీరిపై ఒక్కొక్కరికి రూ. 4 లక్షల రివార్డు ఉందని, వీరి నుంచి 50 జిలెటిన్‌స్టిక్స్, 3 డిటొనేటర్లను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ములుగు డిఎస్పీ జె. విజయసారధి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కేసును వివరిస్తున్న ఓఎస్డీ సురేష్‌కుమార్
*(ఇన్‌సెట్‌లో )మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్న జిలెటిన్‌స్టిక్స్, డిటోనేటర్లు