క్రైమ్/లీగల్

హీరా గోల్డ్ ఎండీకి బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: తక్కువ డబ్బులకు ఎక్కువ వడ్డీ అంటూ గొలుసుకట్టు పథకంతో వేల కోట్ల రూపాయలు వసూళ్ళు చేసి, తిరిగి డి పాజిట్ దారులకు సొమ్ము చెల్లించకుండా సొంత ఆస్తులు పెంచుకున్నారన్న అభియోగాలపై అరెస్టు అయిన హీరా గోల్డ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం నాంపల్లి కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ రోజు పోలీస్టేషన్‌కు హాజరు కావాలని కోర్టు సూచించింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, దుబాయ్‌ల్లో డిపాజిట్ దారుల నుంచి కోట్ల రూపాయలు వసూళ్ళు చేశారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా హీరాగోల్డ్ కంపెనీ పోలీస్ రికార్డుల్లోకి ఎక్కింది. దేశ, విదేశాల్లో 160 బ్యాంకుల్లో హీరాగోల్డ్ కంపెనీల్లోకి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ దారులు జమ చేశారు. తమ కంపెనీల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే వడ్డీ 36 శాతం ఇస్తామని నమ్మించారు. కనీసం రూ. 50 వేల నుంచి 10 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చునని నమ్మబలకడంతో వేలాది మంది తమ డబ్బులను హీరా గ్రూప్‌లో డిపాజిట్ చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా మోసపోయారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల్లో బయటపడింది. కాలపరిమితి ముగిసినప్పటికీ హీరా గ్రూప్ డబ్బులు తిరిగి చెల్చించక పోవడంతో డిపాజిట్ దారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో హీరాగ్రూపు మోసాలు బయటపడ్డాయి. విలాసవంతమైన భవనాలు, సొంత ఆస్తులు దేశ, విదేశాల్లో ఉన్నట్లు పోలీస్ దర్యాప్తుల్లో బయటపడుతున్నాయి.
కోర్టు వద్ద ఉద్రిక్తత
నాంపల్లి కోర్టు వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. హీరా గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్‌కు బెయిల్ నిరాకరించాలని, హీరాగోల్డ్ బాధితులు ఆమె తరపు న్యాయవాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించి బయటకు వెళ్లేందుకు వచ్చిన ఆమె తరపు న్యాయవాది వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ దశలో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. నౌహీరా బాధితులు వందల సంఖ్యలో ఉంటే పోలీసులు కేవలం రెండంకేల సంఖ్యలో ఫిర్యాదులు తీసుకొని కేసు నమోదు చేశారని, దీంతో కేసు బలహీనపడే ఆవకాశం ఉందని బాధితులు ఆరోపించారు. తమ నుండి నౌహీరా షేక్ వసూలు చేసిన డబ్బు తమకు చేరేవిధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని, ఆమెకు బెయిల్ మంజూరు కాకుండా చూడాలని బాధితులు డిమాండ్ చేశారు. బాధితుల తరపున నౌహీరా షేక్‌కు వ్యతిరేకంగా మరో పిటిషన్ దాఖలైంది. దర్యాప్తు కొనసాగుతున్నందున నౌహీరాకు బెయిల్ మంజూరు చేయవద్దని బాధితుల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. మరోవైపు హీరా గ్రూప్ బాధితుల తరపున కౌసిక్ పాషా అనే వ్యక్తి మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. తాము కట్టిన ప్రతి రూపాయి ఇవ్వాల్సిందేనని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
హీరా గోల్డ్ కంపెనీ తమను మోసం చేసిందని
చిత్రం..పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు