క్రైమ్/లీగల్

చెర్వులో మునిగి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, అక్టోబర్ 25: ప్రమాదవశాత్తు మిషన్ కాకతీయ పనుల్లో తవ్విన గుంతలో మునిగి వ్యక్తి మృతిచెందిన సంఘటన హవేళీఘణాపూర్ మండలం బూర్గుపల్లి శ్రీపతి చెర్వులో గురువారం చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పోతగల్ల పెద్దసాయిలు(44) కాలకృత్యాలకువెళ్లి చెర్వులో తవ్విన గుంతల్లో మునిగి మృతిచెందాడు. మృతునికి తల్లిదండ్రులు పెద్దబాలయ్య, కాశమ్మలున్నారు. హవేళీఘణాపూర్ పోలీసులు కుసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

అదృశ్యమైన యువకుడు శవమై తేలాడు.

కౌడిపల్లి, అక్టోబర్ 25. అదృశ్యమైన యువకుడు గురువారం శవమై కనిపించిన సంఘటన గురువారం మండలంలో వెలుగు చూసింది. స్థానిక ఎస్.ఐ. శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని సదాశివపల్లి పంచాయతీ పరిధిలోని పాంపల్లి గ్రామానికి చెందిన అంబూరి క్రిష్ణ (24) ఈ నెల 17 (బుధవారం)న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిన విషయం విదితమే. పరిసర గ్రామమైన కంచన్‌పల్లి అటవీ ప్రాంతంలో గురువారం నాడు క్రిష్ణ ఉరివేసుకొని చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. మేకలకాపరులు గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి ఎస్.ఐ.శ్రీనివాస్ వెళ్ళాడు. మృతదేహం బాగా కుళ్లిపోయి దుర్వాసన వెలువడుతుంది. నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రి నుంచి వచ్చిన వైద్యులు పోలీసుల సమక్షంలో ఘటన స్థలంలోనే శవపంచనామా నిర్వహించారు. తండ్రి అంబూరి బిక్షపతి గత 22న స్థానిక పోలీసుస్టేషన్‌లో పిర్యాదు చేశాడు. స్థానిక ఎస్.ఐ.శ్రీనివాస్ అదృశ్యం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జిల్లాలో వాహన తనిఖీల్లో 10.43లక్షలు పట్టివేత
- సీపీ జోయల్ డేవిస్

సిద్దిపేట, అక్టోబర్ 25 : సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండ ముందస్తుగా 12 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని చెక్ పోస్టుల్లో నిఘా పటిష్టం చేసి, నిరంతరం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం మధ్యాహ్నాం గజ్వేల్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో వంటిమామిడీ వద్ద చెక్‌పోస్టులో 3లక్షల 3వేలు, శాకారం చౌరస్తాలో గౌరారం ఎస్‌ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో లక్ష రూపాయలు, వట్టిపల్లి వద్ద జగదేవ్‌పూర్ ఎస్‌ఐ సాయిరాం ఆధ్వర్యంలో 3.50 లక్షలు మొత్తం 7,53లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. మర్పడగ క్రాస్ రోడ్డు వద్ద తొగుట ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో డీసీఎంలో 2లక్షలు, రాయపోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ నర్సింలు తనిఖీ చేస్తుండగా 90వేల రూపాయలు సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 10,43లక్షల స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలో పట్టుబడిన 10.43 లక్షలను ఎలక్షన్ ఎక్సెండిచర్ కమిటీకి అప్పగించినట్లు సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.

వాహన తనిఖీల్లో రూ. 7లక్షల 53వేలు స్వాధీనం
* గజ్వేల్ ఏసీపీ నారాయణ
గజ్వేల్, అక్టోబర్ 25: వాహన తనిఖీల్లో గురువారం రూ. 7లక్షల 53వేలు స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ నారాయణ పేర్కొన్నారు. గురువారం ప్రజ్ఞాపూర్‌లోని ఏసీపీ ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. గజ్వేల్ ఏసీపీ నారాయణ, రూరల్ సీఐ శివలింగం నేతృత్వంలో వంటిమామిడి క్రాస్ రోడ్డు వద్ద కారులో రూ. 3లక్షల 3వేలు, శాకారం చౌరస్తాలో ఎస్‌ఐ ప్రసాద్ నేతృత్వంలో కారులో తరలిస్తున్న రూ. లక్ష, వట్టిపల్లి శివారులో ఎస్‌ఐ సాయిరాం ఆధ్వర్యంలో కారులో తీసుకెళ్తున్న 3లక్షల 50వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ డబ్బుకు సరైన ఆధారాలు లేవని, కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కమిటీకి ఈ డబ్బును అప్పగిస్తున్నట్లు తెలిపారు.

వాహనాల తనీఖిలో నగదు స్వాదీనం

జగదేవ్‌పూర్, అక్టోబర్ 25: వాహనాల తనీఖిల్లో భాగంగా ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో గురువారం జగదేవ్‌పూర్‌లో తనీఖిలు నిర్వహిస్తుండగా నగదు పట్టుబడినట్లు ఎస్సై తెలిపారు. గొల్లపల్లి చౌరస్తా వద్ద వాహనాలు తనీఖి చేస్తుండగా సాన్‌ట్రో కారులో రూ. 3లక్షల 50 వేలు పట్టుబడగా వాహనదారుని వద్ద ఆ డబ్బుకు సంబందించిన ఎలాంటి అదారాలు లేక పోవడంతో ఆ డబ్బులు సీజ్ చేసినట్లు ఎస్సై సాయిరాం తెలిపారు.