క్రైమ్/లీగల్

వ్యవసాయ పొలం వద్ద వివాహిత హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేగుంట, అక్టోబర్ 25: వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ వివాహితను బంగారు నగలు దోచుకోని హత్య చేసిన సంఘటన బుధవారం రాత్రి మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్‌లో చోటు చేసుకుంది. రుక్మాపూర్ గ్రామానికి చెందిన మ్యాకల రఘుపతి భార్య సరిత(20)ని గుర్తు తెలియని వ్యక్తులు వ్యవసాయ పొలం సమీపంలో అటవిలోకి తీసుకెళ్లి హత్య చేశారు. ఆపై ఆత్యాచార యత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సరిత ఒంటిపై రెండు తులాల పుస్తెలతాడు, అరతులం కమ్మలు దొంగిలించారు. కాళ్ల కడియాలు రాకపోవడంతో వాటిని వదిలేశారు. భర్త బుధవారం రాత్రి నుండి వెతికిగా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం పొలం పక్కన అటవి ప్రాంతంలో వెతుకకగా లోయలో సరిత శవమై కనిపించింది. ఈ విషయమై భర్త రఘుపతి చేగుంట ఎస్సై సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి తూప్రాన్ డీఎస్పీ రాంగోపాల్‌రావు, రామాయంపేట సీఐ వెంకట్‌రెడ్డి, చేగుంట ఎస్సై సత్యనారాయణలు చేరుకొని క్లూస్ టీమ్‌లను రప్పించి సోదాలు చేశారు. మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని నింధితులకు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.