క్రైమ్/లీగల్

టాస్క్ఫోర్స్ తనిఖీలు రూ. 22లక్షల నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 25: ఎన్నికల వేళ నగదు తరలింపుపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించినా కొందరు భారీ మొత్తంలో నగదు తరలిస్తుండటంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. భారీగా తరలిస్తున్న సొమ్ముకు నిబంధనల మేరకు ఎలాంటి ఆధారాలు చూపకుండా సంబంధిత వ్యక్తులు చేతులెత్తేస్తుండటంతో నిత్యం లక్షలాది రూపాయలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నాయి. వ్యాపారుల ముసుగులో ఇతరులు ఎవరైనా ఈ సొమ్మును తరలిస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా పోలీసులు చేస్తున్న తనిఖీల్లో నిత్యం లక్షలకు లక్షలు డబ్బుల కట్టలు పట్టుబడుతున్నా యధావిధిగానే నగదు తరలిస్తుండటం, ఈ సొమ్ము పార్టీలకు చెందిందా..? లేక ఆయా వ్యక్తులదేనా..? లేక వ్యాపారులతో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు చేసుకున్న ఒప్పందాల మేరకు బదలాయింపులు జరుగుతున్నాయా..? అనే అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. కరీంనగరంలోనే మూడు రోజుల్లో రూ. 62లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. మొన్న 20లక్షలు, నిన్న 19.70లక్షలు పట్టుబడగా గురువారం రూ. 22లక్షలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. ఎన్నికల నియమావళిలో భాగంగా గురువారం కరీంనగర్‌లో నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు చూపని రూ. 22లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. హుస్నాబాద్ కాటన్ మిల్లు సూపర్‌వైజర్ అలిగివెల్లి కృష్ణారెడ్డి వద్ద రూ. 20లక్షలు, మరో కాటన్ మిల్లు సూపర్‌వైజర్ గుర్రాల మహిపాల్ వద్ద రూ.2లక్షల నగదు పట్టుబడ్డాయి. 22లక్షల నగదుకు ఎలాంటి ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ వన్ టౌన్ ఠాణాలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా పట్టుబడుతున్న నగదు మొత్తానికి తగిన ఆధారాలు చూపి తిరిగి పొందటంలో సంబంధిత వ్యక్తులు కనబరుస్తున్న జాప్యంతో వ్యాపారులతో రాజకీయ నాయకుల పెనవేసుకున్న బంధం, చేసుకున్న ఒప్పందాలతో సొమ్ము బదలాయింపు జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తుండటం గమనార్హం.