క్రైమ్/లీగల్

18 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సబబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 25: తమిళనాడు అసెంబ్లీలో 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం సబబేనని మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో అసమ్మతి ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న దినకరన్ వర్గం డీలాపడగా, ముఖ్యమంత్రి పళనిస్వామి మద్దతుదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి అప్పటి చీఫ్ జస్టిస్ ఇందిరాబెనర్జీ ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్టు కేసును విచారించిన జడ్జి ఎం.సత్యనారాయణ పేర్కొంటూ అసమ్మతి ఎమ్మెల్యేలపై వేటు సరైనదే అని తీర్పుచెప్పారు. 232 మంది శాసనసభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు గత ఏడాది సెప్టెంబర్ 18న గవర్నర్‌ను కలిసి అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామిపై తమకు విశ్వాసం లేదని తెలిపారు. దీంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ పి.్ధనపాల్ వారిని పదవులకు అనర్హులను చేస్తూ ప్రకటించారు. దీనిపై దాఖలైన కేసును విచారించిన బెంచ్‌లో ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ ఇందిరాబెనర్జీ, జస్టిస్ ఎం.సుందర్ విభిన్న తీర్పులను వెలువరించారు. స్పీకర్ నిర్ణయాన్ని బెనర్జీ సమర్థించగా, దానిని జస్టిస్ సుందర్ విభేదించారు. దీంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఈ కేసు విచారణకు జడ్జిగా ఎం.సత్యనారాయణను నియమించింది. కేసును విచారించిన ఆయన స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత సభ్యులను శాసనసభ్వత్వానికి అనర్హులుగా ప్రకటించడం సబబనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. అయితే తదనంతర పరిణామాల జోలికి ఈ కోర్టు వెళ్లదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసును తన వ్యక్తిగత పరిశీలన ఆధారంగానే తీర్పు ఇస్తున్నానని, దీనిపై గతంలో ఇద్దరు జడ్జిల తీర్పు ప్రభావం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఏఐడిఎంకె హర్షం
తమిళనాడు శాసనసభలో 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై శాసన సభాధిపతి విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించడం పట్ల అధికార ఏఐడిఎంకె హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో ఈ 18 స్థానాలతో పాటు ఖాళీగా ఉన్న రెండు శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమమైందని భావిస్తోంది. కాగా ఈ ఎన్నికలు జరిగే ఈ 20 స్థానాల్లోనూ విజయంపై ఏఐడిఎంకె, డిఎంకె పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ తీర్పు మంచి పరిణామమని ఏఐడిఎంకే వ్యాఖ్యానించగా, ఖాళీ అయిన 20 స్థానాల్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు డిఎంకె విజ్ఞప్తి చేసింది. కాగా, తీర్పు తమ పార్టీకి ఎదురుదెబ్బ ఎంతమాత్రం కాదని ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహిస్తున్న ఎఎంఎకె పార్టీ అధినేత టిటివి దినకర్ వ్యాఖ్యానించారు. ‘ఇది మంచి తీర్పు.. దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మ జయలలిత దీవెనలు మాకెప్పుడూ ఉంటాయి, తీర్పు మాకు ఎంతమాత్రం ఎదురుదెబ్బ కాదు..’ అని అన్నారు. ఈ తీర్పుపై బహిష్కృత ఎమ్మెల్యేలు 18 మందిని సంప్రదిస్తానని, దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలో లేదో వారితో చర్చించిన తర్వాత నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. అయితే ఎన్నికలకు వెళ్లాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. ముఖ్యమంత్రి, ఏఐడిఎంకె నేత పళనిస్వామి మాట్లాడుతూ ఖాళీ అయిన 18 సీట్లలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ఈ తీర్పు దినకరన్‌కు ‘ఒక అనుభవం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతున్న
చిత్రం.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం