క్రైమ్/లీగల్

నకిలీ ఎరువుల తయారీ కేంద్రాలపై విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 26: జిల్లాలో అక్రమంగా నకిలీ సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్న కంపెనీలపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. శుక్రవారం ఇందులో భాగంగా ఆటోనగర్‌లోని మల్లిఖార్జున ఆయిల్స్ సంస్థపై దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన తయారీకి ఉపయోగించే 1500 బస్తాల వేప విత్తనాల నుండి నూనె తీసిన చక్కలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 7.40 లక్షలు ఉంటుందని విజిలెన్స్ ఎస్‌పి శోభామంజరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రైతులకు సేంద్రియ ఎరువుల పేరుతో తక్కువ ధరకు నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా అవుతున్నాయని వచ్చిన సమాచారం మేరకు దాడులు ముమ్మరం చేశామని తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినా, తయారుచేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా మల్లిఖార్జున ఆయిల్స్ యజమానిపై 6ఎ కింద కేసు నమోదు చేసినట్లు శోభామంజరి తెలిపారు.