క్రైమ్/లీగల్

లైగింక వేధింపులు తాళలేక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదబయలు, అక్టోబర్ 26: సీనియర్ అసిస్టెంట్ చేస్తున్న లైంగిక వేధింపులకు తాళలేక పంచాయతీ మహిళా కార్యదర్శి పోలీసుల సమక్షంలోనే ఆత్మహత్య యత్నానికి పూనుకుంది. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను వెనువెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించడంతో ప్రాణాపాయ పరిస్థితి నుంచి బైటపడి కోలుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు బాధితురాలు కథనం ప్రకారం మండలంలోని సీతగుంట పంచాయతీ కార్యదర్శిగా పి.కల్యాణి గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అయితే స్థానిక ఎం.పి.డి.ఒ. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.సీతారామస్వామి సంవత్సర కాలంగా ఆమెను లైగింకంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. సీనియర్ అసిస్టెంట్ లైగింక వేధింపుల విషయమై గతంలో ఎం.పి.డి.ఒ. దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోకపోవడంతో కల్యాణి శుక్రవారం పెదబయలు పోలీసు స్టేషన్‌లో సీతారామస్వామిపై పిర్యాదు చేసారు. పిర్యాదు చేయడమే కాకుండా స్టేషన్‌లోని పోలీసుల సమక్షంలో మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించడంతో కల్యాణికి ప్రాణపాయం తప్పి కోలుకుంటున్నారు. ఈ విషయమై ఎస్.ఐ. కె.రామక్రిష్ణ విలేఖరులతో మాట్లాడుతూ బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకుని కేసు నమోదు చేయనున్నట్టు చెప్పారు. ఇదిలాఉండగా లైగింక వేధింపులకు గురిచేసిన సీనియర్ అసిస్టెంట్ సీతారామస్వామిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, విధుల నుంచి సస్పెండ్ చేయాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం డివిజన్ అధ్యక్షుడు వి.చిరంజీవి, పెదబయలు మండల శాఖ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేసారు.