క్రైమ్/లీగల్

రామజన్మభూమి కేసు నేటినుంచి విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అయోధ్యలోని బాబ్రీ మసీదు - రామ జన్మభూమి వివాదానికి చెందిన 2.77 ఎకరాల భూమిని రాంలల్లా, సున్ని వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారాకు సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం నుంచి విచారణ ప్రారంభించనున్నది. వీటిపై విచారణ జరపకుండా ఇంతకాలం అడ్డుకున్న పిటిషన్లను సెప్టెంబర్ 27న సుప్రీం కోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తి అశోక్ భూషన్, న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేసిన విషయం తెలిసిందే. కాగా, సుప్రీం కోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు సంజయ్ కిషన్, కేఎం జోసెఫ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం సోమవారం 2010 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ ప్రారంభిస్తుంది. ఈ విచారణ పూర్తయితే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు మార్గం సుగమం అవుతుందనేది వాస్తవం. అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పులో 2.77 ఎకరాల భూమిని మూడు సమభాగాలుగా విభజించి వీటిని శ్రీరాముడు, సున్ని వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారాకు కేటాయించింది. నిర్మోహి అఖారా, శ్రీరామచంద్రుడికి కేటాయించిన రెండు భాగాల్లో అద్భుతమైన రాముడి దేవాలయాన్ని నిర్మించాలని విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ ధార్మిక సంస్థలు నిర్ణయించాయి. అయితే, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలు ముస్లిం సంస్థలు పెద్దసంఖ్యలో పిటిషన్లు దాఖలు చేయటంతో ఈ కేసు గత ఏడేళ్లనుండి సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండిపోయింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ బెంచ్‌కి అప్పగించాలంటూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనికితోడు ఇస్లాం మతం ప్రకారం నమాజ్ చేసేందుకు మసీదు ముఖ్యం కాదంటూ సుప్రీం కోర్టు 1994లో ఇచ్చిన తీర్పును కూడా ఈ పిటిషన్లలో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు గత నెల 27న ఇచ్చిన తీర్పులో ఇస్లాం మతం ప్రకారం నమాజ్ చేసేందుకు మసీదు ముఖ్యం కాదంటూ గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనని చెప్పటం గమనార్హం.

అయోధ్యలో రామమందిరం నిర్మించేందుకు వీహెచ్‌పి ఏర్పాటు చేసుకున్న షెడ్డు (ఫైల్ ఫొటో)