క్రైమ్/లీగల్

అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు ఈశ్వర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 28: స్వామి అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి పరుష వ్యాఖ్యలు చేసిన అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కొచికి చెందిన పోలీసులు ఈశ్వర్‌ను అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 153, ఐపీసీ 117 కింద కేసులు నమోదు చేశారు. మహిళలు కనుక దేవాలయంలో ప్రవేశిస్తే రక్తపాతం సృష్టిస్తామంటూ రాహుల్ ఈశ్వర్ గత వారం విలేఖర్ల సమావేశంలో హెచ్చరించారు. 10 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలను అనుమతిస్తే దేవాలయ ప్రాంగణంలోనే స్వామి అయ్యప్ప భక్తులు కత్తులతో తమను తాము పొడుచుకుంటారని ఆయన తెపపారు. ఇదే జరిగితే అర్చకులు దేవాలయాన్ని మూసివేస్తారన్నారు. తిరువనంతపురానికి చెందిన ఒక భక్తుడు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని రాహుల్ ఈశ్వర్‌పైన కేసు నమోదు చేశారు.