క్రైమ్/లీగల్

జనవరిలో చెబుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న రామజన్మభూమి-బాబ్రీమసీదు భూ వివాదం కేసు విచారణ షెడ్యూల్‌ను జనవరి మొదటివారంలో నిర్ధారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎప్పుడు ప్రారంభించాలనే విషయాన్ని సముచిత ధర్మాసనం నిర్ణయిస్తుందని ప్రధాని న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం ప్రకటించింది. అలహాబాద్‌కు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల భవిష్యత్ విచారణ పథాన్ని కూడా ఈ బెంచే నిర్ధారిస్తుందని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు విచారణను జనవరిలో చేపట్టాలా, ఫిబ్రవరి లేదా మార్చిలో చేపట్టాలా అన్నది కూడా జనవరిలోనే సంబంధిత బెంచ్ నిర్ణయిస్తుందని ధర్మాసనం తెలిపింది. బాబ్రీ మసీదు-రామజన్మ భూమి కంటే ముఖ్యమైన కేసులు ఎన్నో ఉన్నాయని, మొదట వాటిని పరిష్కరించిన తరువాతనే ఈ కేసును చేపడతామని రంజన్ గొగోయ్ కిక్కిరిసిన కోర్టుల్లో ప్రకటించారు. గొగోయ్ సోమవారం ఉదయం బాబ్రీ మసీదు- రామజన్మ భూమి కేసును రెండు మూడు నిమిషాల్లో తేల్చివేయటం గమనార్హం. ‘ఈ కేసును జనవరికి వాయిదా వేస్తున్నాం. దీన్ని ఎప్పుడు, ఎలా చేపట్టాలనేది జనవరిలో నిర్ణయిస్తాం’ అని ఆయన ప్రకటించగానే కోర్టు హాల్‌లో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.
ఇలావుండగా, అయోధ్యలోని రామజన్మ భూమిలో రామమందిరం నిర్మించేందుకు అవసరమైన చట్టం చేయాలని, ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని సంఘ్ పరివార్, ఇతర హిందు సంస్థ నాయకులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ‘కోర్టులు ఆయోధ్య వివాదాన్ని పరిష్కరించే పరిస్థితి కనిపించటం లేదు. కాబట్టి రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలి’ అని ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, శివసేన, ఇతర హిందూ సంస్థలతోపాటు బీజేపీకి చెందిన పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలు డిమాండ్ చేశారు. సుప్రీం తీసుకున్న నిర్ణయం సంఘ్ పరివార్‌తోపాటు ఎన్‌డీఏ ప్రభుత్వాధినేతలను సైతం ఆశ్చర్యంతో పాటు నిరుత్సాహానికి గురి చేసింది. ధర్మాసనం
తన నిర్ణయాన్ని ప్రకటించగానే అయోధ్యలో రామమందిరం నిర్మించేందుకు చట్టం చేయాలనే డిమాండ్ ఊపందుకున్నది. దేవాలయ నిర్మాణానికి సంబంధించిన చట్టం ఏర్పడే లోగా ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని సంఘ్ పరివార్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రామజన్మ భూమి విషయంలో హిందువుల ఓపిక నశించిపోతోందని కేంద్ర సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి మంత్రి గిరిరాజ్ సింగ్ హెచ్చరించారు. అయోధ్య అంశాన్ని కాంగ్రెస్ హిందూ-ముస్లిం వివాదంగా మారుస్తోందని సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ కపిల్ సిబాల్ వత్తిడి కారణంగానే కేసును జనవరికి వాయిదా వేశారని మాజీ ఎంపీ వినయ్ కథియార్ ఆరోపించారు. సుప్రీం కోర్టు దేశంలోని మెజారిటీ హిందువుల అభీష్టానికి భిన్నంగా వ్యవహరించిందని ఆయన అన్నారు. ‘బాబర్ సంతతివారు పెరిగిపోతున్నారు. వీరి సంఖ్య మరింత పెరిగితే ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందనేది ఎవరైనా ఊహించుకోవచ్చు’ అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా కేంద్రం తక్షణమే ఆర్డినెన్స్‌ను జారీ చేయాలన్నది తమ డిమాండ్ అని ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి అరుణ్‌కుమార్ చెప్పారు. కోర్టులు అయోధ్య వివాదాన్ని పరిష్కరించలేవని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షియా వక్ఫ్‌బోర్డు కూడా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించేందుకు ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి ఈ మేరకు డిమాండ్ చేస్తామని షియా వక్ఫ్ బోర్డు అధికారులు ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పు కోసం జీవిత కాలం ఎదురు చూడలేమని, రామమందిరం నిర్మించే విషయంలో కేంద్రం తక్షణమే ఆర్డినెన్స్ జారీ చేయాలని విశ్వహిందు పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ డిమాండ్ చేశారు.
కోర్టు తీర్పును గౌరవిస్తాం: రవిశంకర్
రాయిపూర్ (చత్తీస్‌గఢ్): న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, దానిని తాము పూర్తిగా విశ్వసిస్తున్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ వ్యాఖ్యానించారు. మంత్రి ఛత్తీస్‌గఢ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ రామమందిర వివాదాన్ని తమ పార్టీ ఎన్నడూ ఎన్నికలతో ముడిపెట్టదని స్పష్టం చేశారు. సుప్రీం నిర్ణయంపై ఒక న్యాయశాఖ మంత్రిగా తాను ఏమీ మాట్లాడకూడదని, తనకు ఈ విషయంపై కొన్ని పరిమితులు ఉన్నాయని ఆయన అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే దేశంలోని మెజారిటీ ప్రజలు ఈ కేసు త్వరగా విచారణ జరిగి పూర్తికావాలని కోరుకుంటున్నారని, అయితే కోర్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని, దానిని ఎంతో గౌరవిస్తున్నట్టు ఆయన తెలిపారు.

చిత్రం..రామజన్మభూమి కేసు వాయిదా పడిన అనంతరం సుప్రీం కోర్టు వెలుపల విలేఖరులతో మాట్లాడుతున్న నిర్వానీ అఖారా మహంత్ ధరమ్ దాస్