క్రైమ్/లీగల్

ప్రయాణికుల్లా నటిస్తూ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 30: బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తున్నట్లు నటించి తోటి ప్రయాణికుల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ముఠాను తిరుపతి క్రైమ్ పోలీసులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. డీఎస్పీ రవిశంకర్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా, రజకుల కాలనీకి చెందిన పూల భాగ్యమ్మ (30), సోమల మండలం కందుకూరు గ్రామానికి చెందిన శ్యామల (35), సోమల మండలానికి చెందిన అమ్మయ్య (25), సోమల మండలానికి చెందిన సుధాకర్ (36)లు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఏమరుపాటుగా ఉన్న మహిళల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేసి తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. ఈ క్రమంలో మంగళవారం తిరుపతి 150 అడుగుల బైపాస్ రోడ్డు సమీపంలోని రామచంద్రాపురం సర్కిల్ వద్ద పట్టుకున్నామన్నారు. వీరి వద్ద నుండి 10.38లక్షల రూపాయలు విలువ చేసే 346గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరు నలుగురు కందూరు మండలం పరిసర ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారన్నారు. తిరుపతి, మైదుకూరు, మదనపల్లి, వాయల్పాడు, కదిరి, పీలేరు ప్రాంతాల్లోని బస్టాండుల్లో తిరుగుతూ రద్దీగా ఉన్న సమయంలో ప్రయాణికులతో కలసి బస్సు ఎక్కుతున్నట్లు నటించి ఆభరణాలు చోరీ చేసే వారన్నారు. అటు తరువాత చాకచక్యంగా తప్పించుకుని వెళ్లేవారన్నారు. గతంలో కూడా ఇలాంటి చోరీలకు పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించారన్నారు. తిరుపతి క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసుల్లో, తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, పీలేరులో ఒకటి మొత్తం ఐదు కేసుల్లో వీరు నిందితులన్నారు. ఈ నేపథ్యంలో వారిపై నిఘా పెట్టి పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. సీఐ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రైమ్ సిబ్బంది వీరిని అరెస్ట్ చేశారన్నారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచగా, రిమాండు విధించారన్నారు. వీరు మరిన్ని దొంగతనాలు చేసి ఉన్నట్లు సమాచారం ఉందని, కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీలోనికి తీసుకుని విచారించనున్నట్లు తెలిపారు. వీరిని పట్టుకోవడంలో ఎంతో ప్రతిభ కపరిచిన భాస్కర్‌రెడ్డితో పాటు మధు, రసూల్ సాహెబ్, శరత్‌చంద్ర, అబ్బన్న, పద్మలతతో పాటు హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్, దాము, రాజేంద్ర, కోమల, కానిస్టేబుళ్లు భగవతి ప్రసాద్‌రాజు, గోపి, బారుషా, కామేశ్వర్‌రావు, మురళి, మునిమోహన్, మంజుల, భారతి, రాణి, రెడ్డెమ్మ, స్వప్నలను అభినందిస్తున్నామన్నారు. వీరికి రివార్డులు అందించాలని ఎస్పీకి ప్రతిపాదనలు పంపామన్నారు.