క్రైమ్/లీగల్

నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనపర్తి, అక్టోబర్ 30: నకిలీ నోట్లు మారుస్తున్న ఇరువురు వ్యక్తులను అనపర్తి పోలీసులు మంగళవారం అరెస్టుచేసి కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు రామచంద్రపురం డీఎస్పీ జేవీ సంతోష్ అనపర్తి సీఐ కార్యాలయంలో విలేకరులకు వివరించారు. ఆయన మాట్లాడుతూ మండల కేంద్రమైన అనపర్తి సావరం కాలనీ, ఎన్టీఆర్ కాలనీ చినపొలమూరు గ్రామాలకు చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, దొమ్మేటి సతీష్ కుమార్‌లు దొంగనోట్ల దందా నడుపుతున్నారు. సతీష్‌కుమార్ ఇంటిని అడ్డాగా చేసుకుని నకిలీ నోట్ల దందాను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా వంద రూపాయలు, 50 రూపాయలు నోట్లను కలర్ ప్రింటర్‌లో ముద్రించి వాటిని చలామణిలో పెట్టేందుకు సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీన పొలమూరు బ్రాందీ షాపునకు వెళ్లిన సతీష్‌కుమార్ రెండు నకిలీ నోట్లు తీసి మద్యం ఇమ్మని అడిగాడు. సదరు నోట్లు చూసిన షాపు గుమాస్తాకు అనుమానం రావడంతో సతీష్ కుమార్‌ను నిలదీశాడు. గుమాస్తా గట్టిగా గద్దించడంతో సతీష్‌కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. బ్రాందీ షాపు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రెండురోజులుగా గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. మంగళవారం అనుమానితులుగా ఉన్న ఇరువురు అనపర్తిలో తిరుగుతున్న సమాచారం తెలిసిందని, మాటు వేసిన అనపర్తి సీఐ శ్రీనివాస్, ఎస్సై రజనీకుమార్ అనపర్తి ఎర్రకాలువ వంతెన వద్ద అరెస్ట్‌చేసి కేసు నమోదుచేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి వంద నోట్లు 39, యాభై నోట్లు 11,100 రూపాయల నోట్లు, ఒకవైపు ముద్రించిన 848 జిరాక్సులను, కలర్ ప్రింటర్‌ను, ప్రింటింగ్‌కు వినియోగించే పేపర్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ సంతోష్ తెలిపారు. అనపర్తి సర్కిల్ పరిధిలో దొంగ నోట్ల కేసులకు సంబంధించి కేసులున్న వారిపై ఇప్పటికే ఎనిమిది మందిపై సస్పెక్ట్ షీట్లు తెరిచామన్నారు. వారందరి పైనా నిఘా ఉంటుందని, వారిని ప్రతి ఆదివారం విచారించడం నిత్యకృత్యంగా జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో అనపర్తి సీఐ పాలా శ్రీనివాస్, ఎస్సై రజనీకుమార్ పాల్గొన్నారు.