క్రైమ్/లీగల్

ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, అక్టోబర్ 30: మావోయిస్టు మిలీషియాకు చెందిన ఆరుగురు సభ్యులను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుంచి పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ సంగ్రామ్‌సింగ్‌పాటిల్ తెలిపారు. తన కార్యాలయంలో ఆయన శుక్రవారం చర్ల సీఐ సత్యనారాయణ, ఎస్సై రాజువర్మతో కలిసి విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 29న చర్ల పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బి-141 బెటాలియన్‌కు చెందిన బలగాలు చర్ల మండలంలో లెనిన్‌కాలనీ వద్ద ఉంజుపల్లి రోడ్డులో వాహన తనిఖీలు చేపడుతుండగా అనుమానాస్పదంగా ఆరుగురు వ్యక్తులు తారసపడ్డారని తెలిపారు. వారిని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు తెలిపారు. వారిని విచారించామని, మావోయిస్టులు మిలీషియా సభ్యులుగా తేలిందని ఏఎస్పీ వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా రామ్‌పూర్ గ్రామానికి చెందిన మడివి భుద్రా, మడివి భీమా, మడివి సుక్కా, కుంజా అద్మా, మడివి జాగా, మడివి భుద్రాలుగా తేలిందని, వీరంతా మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యులుగా పని చేస్తున్నారన్నారు. వీరివద్ద నుంచి 30 జిలిటెన్ స్టిక్స్, 3టిఫిన్ బాక్స్‌లు, 3 కట్ల వైరు, 5 డిటోనేటర్స్, 180 ఇనుప చువ్వలు స్వాధీనం చేసుకున్నామని, వారిని రిమాండ్‌కు పంపుతున్నట్లు ఏఎస్పీ వివరించారు. కాగా పోలీసులు అరెస్టు వీరంతా ఈనెల 28న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులు, మిలీషియా సభ్యుల సమావేశానికి హాజరయ్యారని, పోలీసు బలగాలు లక్ష్యంగా చేసుకోని చర్ల మండలంలో అటవీ ప్రాంతంలో మందుపాతరలు అమర్చాలని వీరికి మావోయిస్టు పార్టీ నేతలు బాధ్యతలు అప్పగించారని ఏఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో వాహన తనిఖీల్లో పట్టుబడ్డారని, కూంబింగ్ వెళ్లే పోలీసులను హతమార్చడమే వీరి లక్ష్యమని తెలిపారు.