క్రైమ్/లీగల్

వాహనాల తనిఖీల్లో 9.19లక్షలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 30 : ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలీసు కమిషనర్ ఆదేశానుసారం వాహనాల్లో తనిఖీల్లో మంగళవారం 9,19,340 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట రూలర్ పోలీస్ స్టేషన్ అంబేద్కర్ చౌరస్తాలో సీఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేయగా 1.04లక్షలు, మరోక వాహనంలో 2,52, 350 రూపాయలు మొత్తం 3,56,350 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫీక్ ఎసీపీ బాలాజీ ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా 3లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. చిన్నకోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని సిరిసిల్లా వై జంక్షన్‌లో సీఐ మున్వర్ షరీఫ్, ఎస్‌ఐ అశోక్‌లు వాహనాలు తనిఖీలు చేపట్టి 1,33, 990 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెజ్జంకి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ అభిలాష్ సిబ్బందితోవాహనాలు తనిఖీ చేపట్టగా 1,29లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏలాంటి ఆధారాలు చూపించనందుకు డబ్బులు సీజ్ చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన డబ్బులను ఎన్నికల ఎక్స్‌ండీచర్ కమిటీకి అప్పగించనున్నట్లు తెలిపారు.