క్రైమ్/లీగల్

అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, అక్టోబర్ 31: పంట పండించేందుకు చేసిన అప్పులు తీర్చలేననే బెంగతో కౌలు రైతు పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మన్యంలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని లాగరాయి గ్రామానికి చెందిన అనివిరెడ్డి సత్యానందం (34) అనే యువరైతు మంగళవారం రాత్రి ఇంటివద్ద చేనుకు ఉపయోగించే పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు అతనిని హుటా హుటిన లాగారాయి పీహెచ్‌సీకి తీసుకెళ్లగా అక్కడ ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో అంబులెన్సులో కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యానందం బుధవారం మరణించాడు. లాగరాయిలో పుట్టి పెరిగిన సత్యానందం సొంత పొలం లేకపోయినా అయిదెకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి, పొగాకు, పత్తి పంటలు సాగు చేస్తున్నాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోవడంతో పాటు దిగుబడి కూడా తగ్గి అప్పులు పెరిగిపోతాయనే ఆందోళనతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సక్రమంగా పంటలు పండక చేసిన రూ.3లక్షల అప్పులు తీరవనే బెంగతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. సత్యానందంకు భార్య, ఇరువురు పిల్లలున్నారు. సత్యానందం మృతదేహం వద్ద వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై రవికుమార్ తెలిపారు.