క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో పాలకొల్లు మున్సిపల్ ఏఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, అక్టోబర్ 31:కాంట్రాక్టర్ ధర్మారావు పిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ వి గోపాలకృష్ణ నేతృత్వంలో పన్ని వలలో పాలకొల్లు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరు రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికి పోయారు. ధర్మారావు పాలకొల్లు మున్సిపాల్టీలో రూ.2కోట్లకు పైగా పనులను సకాలంలో గత మార్చి నెలకే పూర్తిచేశారు. కానీ తన బిల్లులు చెల్లించటానికి లంచం లేనిదే చేయని భీష్మించుకున్న ఏఈ చర్య పట్ల విసుగుచెంది తమకు పిర్యాదు చేశారని, దానితో తాము బుధవారం వచ్చి తమ నోట్లు ఇచ్చి పంపామని నోట్లు ఇంజనీరు జె ఫణి శ్రీనివాసరావు తీసుకున్నాడని ఆయన చెప్పారు. మిగతా విషయాలు దర్యాఫ్తు చేస్తామని ఆయన వెల్లడించారు. తనకు బిల్లు రావటంతోనే సొమ్ము చెల్లిస్తానని, మొత్తం పెట్టుబడులు పెట్టి ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించక పోవటం వల్ల తాను అప్పుల బాధ పడలేక ఆత్మహత్య చేసుకునే దుస్థితో ఉన్నానని వేడుకున్నానని కాంట్రాక్టర్ ధర్మాజీరావు పాత్రికేయులకు వెల్లడించారు. కనీసం మానవతావాదం లేకుండా తనతో ఆడుకున్నారని తన గోడు వినక పోవటంతో తప్పని పరస్థితిలో ఏసీబీని ఆశ్రయించానని ఆయన చెప్పారు. ఏసీమీ డిఎస్‌పితోపాటు సీఐ కె శ్రీనివాస్, ఇతర సిబ్బంది వచ్చి రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకొని నోట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఒక కారుణ్య నియామంకలో మేనేజర్ ఉద్యోగి పెట్టిన ఇబ్బందుల వల్ల ఏసీబీకి పిర్యాదు చేశారని, ఇది రెండోసారి జరగటంలో ఉద్యోగుల్లో ప్రకంపనలు పుట్టాయి. చినవెంకన్న ఆలయంలో బాంబ్, డాగ్‌స్క్వాడ్ బృందాల తనిఖీలు
ద్వారకాతిరుమల, అక్టోబర్ 31: చినవెంకన్న ఆలయంలో భద్రతలో భాగంగా బుధవారం బాంబ్, డాగ్‌స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రధాన ఆలయాల్లో ఈ తనిఖీలు జరుపుతున్నట్టు ఏఆర్ అదనపు ఎం మహేష్‌కుమార్ తెలిపారు. తనిఖీల్లో భాగంగా ఆలయ అనివేటి మండప ప్రాంతం, రాజగోపురాల పరిసరాలు, ఆలయ ప్రాకారంలోని మండప ప్రాంతాలు ఇలా అన్ని విభాగాలను బాంబు, డాగ్‌స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. అనంతరం ద్వారకాతిరుమలలోని బస్టాండ్, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. ఈతనిఖీల్లో బాంబ్ స్క్వాడ్ పీసీ ఎస్ దుర్గారావు, డి నాగేశ్వరరావు, డాగ్ హ్యాండ్లర్ డిడి ప్రసాద్ పాల్గొన్నారు.