క్రైమ్/లీగల్

కబళించిన మృత్యువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 31: ఇరువురు యువకుల నిండు నూరేళ్ల జీవితాన్ని లారీ రూపంలో మృత్యువు కబళించింది. మారుమూల ప్రాంతమైన బందరు మండలం వాడపాలెం శివారు గరువు గ్రామానికి చెందిన ఆ ఇరువురు యువకులు బుధవారం చిన్నాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వీరితో పాటు మరో యువకుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సేకరించిన వివరాల ప్రకారం గరువు గ్రామానికి చెందిన ఒడుగు గణపతి కుమారుడు సాయిరాం(22), మోకా మల్లేశ్వరరావు కుమారుడు సహదేవుడు (17), ఒడుగు మహారుద్రుడు కుమారుడు కుమార స్వామి (18) ద్విచక్ర వాహనంపై కాలేఖాన్‌పేట వచ్చారు. రొయ్యల చెరువుల్లోకి మెడిసిన్ కొనుగోలు చేసుకుని వెళుతుండగా చిన్నాపురం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని స్థానిక హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సాయిరాం, సహదేవుడు మృతి చెందారు. కుమార స్వామి తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. మృతుల్లో సాయిరాం బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతుండగా సహదేవుడు ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. కుమార స్వామి ఎంబీఎ చదువుతున్నాడు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించి విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జిల్లా ఎస్పీ త్రిపాఠి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును డీఎస్పీ మొహబూబ్ బాషా, రూరల్ సీఐ బిబి రవి కుమార్ ఎస్పీకి వివరించారు.