క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, నవంబర్ 1: రైతులకు ఈపాస్‌బుక్కులు మంజూరు చేయడంలో వీ ఆర్ ఓలు చూపిస్తున్న చేతి వాటం, అవినీతికి రైతులు విసిగి వేసారి ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా వీ ఆర్ ఓలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నప్పటికి వారి పనితీరులో మార్పురావడం లేదు. తాజాగా శిరివెళ్ల హెడ్‌క్వార్టర్ వీ ఆర్ ఓ తిరుపాలు ఈపాస్ బుక్కు మంజూరు కోసం రైతు నుండి డబ్బులు డిమాండ్ చేయగా, రైతు జాఫర్ వలి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శిరివెళ్లలో కాపురం ఉండాల్సిన వీ ఆర్ ఓ తిరుపాలు నంద్యాల పట్టణంలోని బైర్‌మల్ వీధి బసవన్న గుడి సమీపంలో ఉంటున్నారు. రైతు జాఫర్ వలి ఈపాస్ బుక్కు కోసం గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వీ ఆర్ ఓ తిరుపాలును సంప్రదించగా పట్టణంలోని ఓ కూల్‌డ్రింక్ షాపు వద్దకు రావాలని కోరడంతో ఏసీబీ అధికారులు ఆ కూల్‌డ్రింక్ షాపు వద్ద వలవేసి వీ ఆర్ ఓ తిరుపాలు కూల్ డ్రింక్ షాపులోకి ప్రవేశించి రైతు జాఫర్ వలి ద్వారా రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పంచనామా నిర్వహించి లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీ ఆర్ ఓ ఇంట్లో కూడా రికార్డులు పరిశీలించినట్లు తెలిసింది. ఏసీబీ దాడి డీ ఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో సీ ఐలు, ఎస్ ఐ, పంచనామాచేసేందుకు అధికారులు పాల్గొన్నారు.