క్రైమ్/లీగల్

మోసాలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌతాళం, నవంబర్ 1:పలు మోసాలకు పాల్పడిన షేక్ సలీమ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆదోని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. డీఎస్పీ గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ షేక్ సలీమ్ సొంత ఊరు దిబ్బనకల్ గ్రామం అని అతడు 2016 నుంచి పలు మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. గ్రామంలో పలువురితో ఘర్షణ పడగా ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదయ్యాయన్నారు. ఆయా కేసుల్లో ఫిర్యాదుదారులను బెదిరించడంతో ఆదోని వన్ టౌన్ పీఎస్‌లో కూడా కేసు నమోదవడంతో భయపడి చిత్తూరు జిల్లా పీలేరు పట్టణానికి పారిపోయి అక్కడ జనజాగృతి సంస్థను నెలకొల్పి మళ్లీ పలు మోసాలకు పాల్పడ్డాడన్నారు. ఈక్రమంలో గత నెల 22వ తేదీ ఢిల్లీలోని ఆఫీసుకు ఫోన్ చేసి బెదిరించినట్లు యూనిసెఫ్ ప్రతినిధులు ఒక రిపోర్టును డీజీపీకి పంపారన్నారు. దీంతో అతడిపై విచారణ చేపట్టి కౌతాళం గ్రామంలో ఉన్నట్లు తెలుసుకుని ఆదోని తాలూకా ఎస్‌ఐతో పాటు సిబ్బంది అరెస్టు చేయడానికి వెళ్లగా వారిపై తిరగబడి విధులకు ఆటంకం కల్గించడంతో కౌతాళం పీఎస్‌లో కూడా కేసు నమోదైందన్నారు. ఇలాంటి వ్యక్తుల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ సూచించారు.
గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధం
ఆదోనిటౌన్, నవంబర్ 1:పట్టణంలోని విజయభాస్కర్‌రెడ్డి కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె కాలిపోయిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఎలాంటి ప్రాణపాయం జరగలేదని, అయితే సామగ్రి మొత్తం కాలిపోయిందని బాధితురాలు లక్ష్మీ వాపోయింది. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా కార్యదర్శి మధుసూదన్‌శర్మ బాధితులను పరామర్శించారు. అలాగే ఈ విషయాన్ని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన తనయుడు మనోజ్‌కుమార్‌రెడ్డి ఆ కుటుంబాన్ని పరామార్శించి బియ్యం, ఇతర ఆహార పదర్థాలు అందజేశారని తెలిపారు. అలాగే తెలుగు యువత రాష్ట్ర నాయకులు భూపాల్‌చౌదరి కూడా బాధితులను పరామర్శించి రూ. 10వేలు, 50 కిలోల బియ్యం, ఇతర ఆహార పదర్థాలు అందజేశారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం కింద పక్కా గృహం నిర్మిస్తామని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
పత్తికొండ, నవంబర్ 1:మండల పరిధిలోని మందగిరి గ్రామానికి చెందిన రైతు హరిజన శ్రీరాములు(40) గురువారం విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మోటారు మరమ్మతుల అనంతరం పొలానికి నీరు పెట్టేందుకు విద్యుత్ లైన్ వేయగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అతడికి భార్య లక్ష్మీ, ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.