క్రైమ్/లీగల్

అత్యాచారయత్నానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, నవంబర్ 1: మండల పరిధిలోని పులిగడ్డ ఆక్విడక్టు వద్ద మంగళవారం రాత్రి డీఎస్సీ కోచింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న అభ్యర్థినికి అవనిగడ్డ సెంటరులో ఆమె స్నేహితుడు కనిపించగా అతని బైక్‌పై ఎక్కి మోపిదేవి వెళుతున్నారు. పులిగడ్డ బ్రిడ్జి వద్ద రోడ్డు పక్కన వారిద్దరిని ఆపి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పోతురాజు తెలిపారు. పోలీసులు అందించిన వివరాలు ప్రకారం బైక్‌పై వెళుతున్న అబ్బాయిని బంధించి మిగిలిన ఇద్దరు అమ్మాయిని రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కుని వెళ్లడానికి ప్రయత్నించారు. దాంతో ఆమె భయంతో కేకలు వేయగా ఆటుగా వస్తున్న బండి లైట్లు చూసి ముగ్గురు పారిపోయారు. తరువాత వారు అవనిగడ్డ బస్టాండ్‌కు వచ్చి జరిగిన విషయం అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పగా తల్లిదండ్రులు వచ్చిన తరువాత వారంతా కలిసి అవనిగడ్డ పోలీసు స్టేషన్‌లో కేసుపెట్టారు. దర్యాప్తులో భాగంగా పులిగడ్డకు చెందిన మండలి భానుప్రకాష్, గుంటూరు విజయబాబు, అర్జా సురేంద్రలను నిందితులుగా గుర్తించి గురువారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. కాగా నిందితులను అవనిగడ్డ కోర్టులో హాజరుపెట్టగా న్యాయమూర్తి రిమాండ్‌కు పంపారు.