క్రైమ్/లీగల్

లైంగిక వేధింపులపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదబయలు, నవంబర్ 2: మండలంలోని సీతగుంట పంచాయతీ కార్యదర్శి కల్యాణిపై మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామస్వామి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై జిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారి శుక్రవారం విచారణ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆమె విచారణ చేపట్టి లైంగిక వేధింపులపై పలు వర్గాల వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత మహిళ కల్యాణి తనకు జరిగిన అన్యాయాన్ని విచారణ అధికారికి వివరించింది. స్థానిక జెడ్పీటీసీ గంగాభవని, ఎం.పి.టి.సి. కోడా సావిత్రి, పలువురు మాజీ సర్పంచ్‌లు, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, కార్యదర్శుల సంఘం నాయకులు సీనియర్ అసిస్టెంట్ సీతారామస్వామి చేసిన లైంగిక వేధింపులను ఆమెకు వివరించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ సీనియర్ అసిస్టెంట్ సీతారామస్వామి లైంగిక వేధింపులపై తాను అన్ని వర్గాల నుంచి విచారణ చేపట్టి లిఖితపూర్వకంగా వారి వారి వాంగ్మూలాలను తీసుకున్నట్టు చెప్పారు. లైగింక వేధింపులకు పాల్పడిన సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్‌కు సిఫార్సు చేస్తూ కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్టు ఆమె తెలిపారు.

ఆటో ప్రమాదంలో మహిళ మృతి
ముంచంగిపుట్టు, నవంబర్ 2: మండలంలోని బాబుశాల పంచాయతీ గాదెలపుట్టు గ్రామానికి చెందిన కిల్లో సొమారి (40) అనే మహిళ శుక్రవారం ఆటో ప్రమాదంలో మృతి చెందింది. బంధువుల ఇంటికి శుభ కార్యానికి బాబుశాల గ్రామానికి ఆటోలో వెళుతుండగా ఆటో బోల్తాపడింది. ఈ సంఘటనలో సొమారి అక్కడికక్కడే మృతి చెందగా మరో తొమ్మిది మంది స్వల్పంగా గాయపడ్డారు. మృతి చెందిన మహిళ భర్త గతంలోనే మృతి చెందడంతో ఆమెకు ఉన్న ఇద్దరు చిన్నారులు అనాధులుగా మారారు. ఈ సంఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్.ఐ. అరుణకిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైకు ఢీకొని గిరిజనుడు మృతి
జి.మాడుగుల, నవంబర్ 2: మోటార్ బైకు ఢీ కొట్టిన ఘటనలో గిరిజనుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని భీరం పంచాయతీ వనెల్బ గ్రామానికి చెందిన పెద్ద చిన్నయ్య, ఆయన భార్య పెద్దమ్మి గత నెల 31వ తేదిన కంబాలబైలు గ్రామానికి కాలి నడకన వస్తుండగా పులుసుమామిడి నుంచి పాడేరు వెళుతున్న మోటార్ బైకు వీరిని డీ కొట్టింది. ఈ సంఘటనలో చిన్నయ్య తీవ్రంగా గాయపడగా, పెద్దమ్మికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన చిన్నయ్యకు పాడేరు ఏరియా ఆసుపత్రిలో ప్రధమ చికిత్స నిర్వహించి విశాఖపట్నం కింగ్‌జార్జి ఆసుపత్రికి తరిలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంపై పెద్దమ్మి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్.ఐ. శుక్రవారం విలేఖరులకు తెలిపారు.

క్షయ వ్యాధితో గిరిజనుడు మృతి
హుకుంపేట, నవంబర్ 2: మండలంలోని గడికించుమండ పంచాయతీ దొంతురాయి గ్రామానికి చెందిన పినుమల సన్నిబాబు (46) అనే గిరిజనుడు క్షయ వ్యాధితో గురువారం రాత్రి మృతి చెందాడు. గత కొంతకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతున్న ఆయన స్థానికంగా వైద్య సేవలు పొందుతున్నప్పటికీ వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడమే కాకుండా బుధవారం పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను విశాఖపట్నం కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు.

గిరిజన మహిళ హత్య
సీలేరు, నవంబర్ 2: మండలంలోని దుప్పలవాడ పంచాయతీ శాండికోరి గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఒడిస్సాకు చెందిన సిసా డొమ్ము (45)ను హత్య చేసినట్టు హతురాలి బంధువులు శుక్రవారం ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ. విభూషణరావు తెలిపారు. ఎస్.ఐ. కధనం ప్రకారం గూడెంకొత్తవీధి మండలం దుప్పలవాడ పంచాయతీ శాండికోరి గ్రామ సమీపంలోని సీలేరు నది అవతల ఒడిస్సాకు చెందిన డొమ్ము అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ గ్రామంలో భూమిని లీజుకు తీసుకునేందుకు మాట్లాడే పని ఉందని చెప్పి తీసుకువచ్చి కల్లు తాగారు. అనంతరం ఈ నలుగురు వ్యక్తులు డొమ్ముతో తగాదాకు దిగడంతో ఈ గ్రామానికి చెందిన వారు అడ్డుపడి ఎందుకు ఆమెను కొడుతున్నారని నిలదీసారు. అయితే ఏమీ లేదని, డోనాపుట్టు వెళ్లిపోతామని చెప్పి గ్రామ శివారులోని టేకు తోటలోకి డొమ్మును తీసుకువెళ్లి కర్రలతో కొట్టి హతమార్చారు. గ్రామస్తులు నీటి కోసం గెడ్డకు వెళ్లగా డొమ్ము మృతదేహం కనిపించగా బంధువులకు సమాచారం అందించారు. ఈ విషయమై హతురాలి బంధువులు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఎస్.ఐ. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నట్టు ఎస్.ఐ. చెప్పారు. డొమ్ము మృతదేహాన్ని శవ పంచనామాకు తరలించినట్టు ఆయన తెలిపారు.

ఫాము కాటుతో బాలింత మృతి
సీలేరు, నవంబర్ 2: జి.కె.వీధి మండలం దారకొండ ముడసర వీధిలో ఒక బాలింతరాలు పాము కాటుకు గురై శుక్రవారం మృతి చెందింది. ముడసర వీధికి చెందిన వరద సింహాచలం భార్య సత్యవతి (30) బాలింతరాలు కాగా గురువారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేసింది. అర్థరాత్రి సమయం కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించలేకపోయారు. తెల్లవారుజామున సత్యవతి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో దారకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించడంతో సిబ్బంది వైద్య సేవలు అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఇటీవల తన బిడ్డను కోల్పోయిన సత్యవతి పాముకాటుతో మృతి చెందడంతో భర్త సింహాచలం బోరున విలపించారు. ఈ సంఘటన గ్రామస్తులను విచారానికి గురిచేసింది.