క్రైమ్/లీగల్

వివాహం ఇష్టంలేక కానిస్టేబుల్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకుమాను, నవంబర్ 2: పెళ్లైతే అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులకు దూరమవుతానేమోనన్న భయంతో మండల కేంద్రమైన కాకుమానుకు చెందిన యువతి వై మల్లేశ్వరి (27) ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది. కాకుమానుకు చెందిన వై శంకరరావు దంపతులకు ఇద్దరు సంతానం కాగా వై మల్లేశ్వరిని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచడంతో పాటు ఆమెను చదివించి పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చే వరకు కష్టపడ్డారు. ప్రస్తుతం చిలకలూరిపేట రూరల్ పోలీసుస్టేషన్‌లో మల్లేశ్వరి కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె మల్లేశ్వరిని వివాహం చేసి ఓ ఇంటిదాన్ని చేయాలన్న దృఢ సంకల్పంతో తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కూడా కుదిర్చారు. కాగా ఈనెల 9వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. వివాహం జరిగితే తన తల్లిదండ్రులకు దూరమై అత్తవారింట్లో అధిక సమయం ఉండాల్సి వస్తుందనే ఆలోచనతో మల్లేశ్వరి ఎలుకల మందు తాగి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆమెను వెంటనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మణిపాల్ హాస్పిటల్‌కు రిఫర్ చేయడంతో అక్కడికి వెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మల్లేశ్వరి మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన కాకుమాను ఎస్‌ఐ జి అంజయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి, అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.