క్రైమ్/లీగల్

ముమ్మరంగా వాహనాల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, నవంబర్ 2: మన్యంలో మావోయిస్టుల కదలికలు ఉండటంతో శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ వసతి గృహం సమీపంలో పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. విశాఖ ఏజెన్సీ నుండి జిల్లా ఏజెన్సీకి మావోయిస్టులు తరలివచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే అవకాశమున్నందున ముందు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రతీ వాహనాన్ని నిశితంగా పరిశీలించి, ప్రయాణీకుల లగేజీని తనిఖీ చేశారు. అనుమానితులను ప్రశ్నించి విడిచిపెట్టారు. రికార్డులు సక్రమంగా లేని వాహన చోదకుల నుండి అపరాధ రుసుం వసూలు చేశారు. మరోపక్క విశాఖ మారుమూల ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయి రవాణాపై కూడా పోలీసులు దృష్టి సారించారు. స్థానిక ఎస్సై రవికుమార్, పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.