క్రైమ్/లీగల్

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కణేకల్లు, నవంబర్ 3 : మండల పరిధిలోని జక్కలవడికి గ్రామానికి చెందిన రైతు చిద్దలప్పగారి ఆంజనేయులు (36) శనివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు ఆంజనేయులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇందులో భాగంగానే పంటలు సాగు చేసి ప్రతిసారి నష్టం వస్తుండటంతో దాదాపు రూ.6 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈనేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలని మదనపడుతూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. భార్య మారెక్క ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆంజనేయులుకు ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారు.