క్రైమ్/లీగల్

వ్యక్తిపై కొడవలితో దాడి.. పరిస్థితి విషమం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె, నవంబర్ 4: మండల పరిధిలోని దినె్నమీద బలిజపల్లెకు చెందిన బాలక్రిష్ణ(55)పై హత్యాయత్నం జరిగింది. వివరాలలోకి వెళ్లితే.. బాలక్రిష్ణ అలియాస్ బాల ఆదివారం తిమ్మసముద్రం రెవెన్యూ గ్రామ పరిధిలోని తన మామిడి తోట వద్దకు స్కూటీపై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మామిడితోట నుండి బంధువు రెడ్డిచర్ల ఆనంద్‌తో కలిసి వస్తుండగా తోటకు పీలేరు రహదారి మధ్యలో వంక సమీపంలోని వెదురు మాటు నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి తనను పక్కకు తోసివేసి బాలక్రిష్ణను ఒకరు పట్టుకొని మరొకరు కొడవలితో పలుసార్లు నరికి పారిపోయినట్లు ఆనంద్ తెలిపారు. హత్యాయత్నం విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నరసింహారెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన వెళ్లి రక్తస్రావంతో ఉన్న బాలకృష్ణను ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం తీవ్ర రక్తస్రావంతో కిందపడిపోయిన బాలక్రిష్ణను108 సిబ్బంది తమ వాహనంలో కుటుంబసభ్యుల తిరుపతికి తరలించారు.అనంతరం ఎస్‌ఐ నరసింహారెడ్డి కేసు దర్యాప్తులో భాగంగా తిరుపతిలోని హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణ భార్య రాజమ్మను విచారించి సంఘటనపై ఆరా తీశారు.
ఐదు చోట్ల గాయాలు: హత్యాయత్నంలో బాలకృష్ణకు ఐదు చోట్ల గాయాలైనట్లు ఆయన బంధువుల ద్వారా తెలిసింది. గుర్తు తెలియని వ్యక్తులు కొడవలితో మెడ, భుజం, కడుపు, వీపు, ఛాతిపై నరికినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో కొడవలితో నరికిన వ్యక్తి ప్యాంటు, షర్టు ధరించగా మరో వ్యక్తి ముఖానికి గుడ్డ కట్టుకొని ఉన్నట్లు అక్కడే ఉన్న ఆనంద్ తెలిపారు.
డీ ఎస్పీ విచారణ: తిమ్మసముద్రం యల్లంపల్లె గ్రామ సమీపంలో బాలకృష్ణపై జరిగిన హత్యాయత్నంపై పులివెందుల డీ ఎస్పీ నాగరాజు ఉదయం నుండి సాయంత్రం వరకు విచారించారు. అంతకు ముందు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రాయచోటి రూరల్ సీ ఐ నరసింహరాజు సంఘటనపై డీ ఎస్పీకి వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నట్లు డీ ఎస్పీ నాగరాజ తెలిపారు.