క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో ఫైర్ ఆఫీసర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, నవంబర్ 5: అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు ఓ (అధికారి) అవినీతి చేప చిక్కింది. రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా ఆ అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. అవినీతి నిరోధక శాఖ డీఎస్‌పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం... జనగామ జిల్లా ఫైర్ ఆఫీసర్ రామగోని సత్యనారాయణ రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని తెలిపారు. జనగామ పట్టణానికి చెందని పెద్ది సత్యనారాయణ అనే బాణసంచా విక్రయాల వ్యాపారి దీపావళి సందర్భంగా పట్టణంలో టపాసుల వ్యాపారం కోసం అనుమతి ఇవ్వాలని జిల్లా అగ్నిమాపక అధికారి రామగోని సత్యనారాయణ వద్దకు గత 20రోజుల క్రితం వెళ్ళాడని తెలిపారు. డబ్బులు ఇస్తేనే అనుమతి ఇస్తానని అతనిని ఇబ్బందులు పెడుతుండగా వ్యాపారి పెద్ది సత్యనారాయణ తమను ఆశ్రయించాడని వివరించారు. వ్యాపారికి తాము రూ. 10వేల డబ్బులు ఇచ్చి పంపించామని అన్నారు. ఆ డబ్బులను వ్యాపారి చేతుల మీదుగా తీసుకుంటుండగా అకస్మాత్తుగా వెళ్లి అగ్నిమాకప కేంద్రంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా ఫైర్ జిల్లా అధికారి రామగోని సత్యనారాయణను పట్టుకున్నామని తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని అన్నారు. ఈ దాడుల్లో తమ వెంట ఏసీబీ సీఐలు వాసాల సతీష్, క్రాంతికుమార్, పులి వెంకట్‌లు ఉన్నారని వివరించారు. అనంతరం బాధితుడు పెద్ది సత్యనారాయణ మాట్లాడుతూ బాణాసంచాలను విక్రయించేందుకు అవకాశం ఇవ్వాలని ధరఖాస్తు చేసుకోగా తమను రూ. 15వేలు ఇవ్వాలని ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ డిమాండ్ చేశారని తెలిపారు. తాను గత సంవత్సరం బాణాసంచాల విక్రయ వ్యాపారంలో నష్టపోయానని, ప్రస్తుతం అన్ని డబ్బులు ఇవ్వలేనని వేడుకున్నప్పటికీ ఏ మాత్రం కనికరించలేదని తెలిపారు. రూ. 12వేలు ఇచ్చి టపాసులు అమ్ముకోమని అన్నాడని వివరించారు. తాను రెండు రోజుల క్రిందట వరంగల్ కేంద్రానికి వెళ్ళి ఏసీబీ అధికారులను కలిశానని అన్నారు.

చిత్రం..పట్టుబడిన సత్యనారాయణ