క్రైమ్/లీగల్

శ్రీనును విడిచిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 5: విపక్ష నేత వైస్ జగన్‌పై గత నెల 25న విశాఖ విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ ఇప్పించేందుకు విశాఖకు చెందిన ఒక న్యాయవాది స్వచ్ఛంధంగా ముందుకు వచ్చాడు. దాడి ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకోవడంతో శ్రీనివాస్‌కు బెయిల్ కోసం ప్రయత్నించేందుకు కుటుంబీకులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన సలీమ్ అనే న్యాయవాది శ్రీనివాస్ తరపున వకాలత్ తీసుకుని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే రెండో సారి తమ కస్టడీకి శ్రీనివాస్‌ను అప్పగించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేయగా, న్యాయవాది సలీమ్ కూడా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వాంగ్మూలాన్ని పోలీసులకు ఇచ్చిన శ్రీనివాస్ ఇక చెప్పేందుకు ఏమీ లేదని న్యాయవాది పేర్కొంటున్నారు. తనకు ప్రాణహాని ఉందని కూడా శ్రీనివాస్ భయపడుతున్నట్టు తెలిపారు.