క్రైమ్/లీగల్

నడిరోడ్డుపై కత్తితో యువకుడి వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, నవంబర్ 5: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషను పరిధిలోని ఉండవల్లిలో సోమవారం కొప్పోలు ప్రదీప్‌కుమార్ అనే యువకుడు కత్తితో నడిరోడ్డుపై ప్రత్యర్థులను దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించాడు. పాతకక్షల నేపథ్యంలో అతని ప్రత్యర్థులుగా భావిస్తున్న సింగంశెట్టి పుల్లయ్య, అతని బంధువులు ఉండవల్లి సెంటర్‌కు వెళుతుండగా ప్రదీప్‌కుమార్ కత్తితో, దిలీప్‌కుమార్, సాయిసురేష్ కర్రలతోను దాడిచేసి వారిని హతమార్చేందుకు విఫలయత్నం చేశారు. పుల్లయ్య పారిపోయి తాడేపల్లి పోలీసు స్టేషనుకు వెళ్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రదీప్‌కుమార్, దిలీప్‌కుమార్‌లను అరెస్ట్ చేసినట్లు లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ విలేఖరులకు తెలిపారు. ప్రదీప్‌కుమార్ నుంచి ఇనుప కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.