క్రైమ్/లీగల్

25 కిలోల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయికోడ్, నవంబర్ 6: ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా దాచిన 25 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ సుధాకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం రాయికోడ్ మండలంలోని కుసునూర్ గ్రామానికి చెందిన వైద్యనాథ్ గుట్టు చప్పుడు కాకుండా తన ఇంట్లో గంజాయి దాచాడన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం వైద్యనాథ్ ఇంటిపై తన సిబ్బందితో కలిసి దాడి చేయగా 25 కిలోల ఎండు గంజాయి లభ్యమైందన్నారు. దీని విలువ సుమారు రెండు లక్షలు ఉంటుందన్నారు. నింధితుడి వద్ద ఉన్న టీవీఎస్ ఎక్సల్ బండిని సీజ్ చేసి వైద్యనాథ్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు. బుధవారం రిమాండ్‌కు తరలించనున్నట్లు వారు తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎస్సైలు రాణి, శంషోద్దీన్, సిబ్బంది అశోక్‌కుమార్, బాగన్న, రాజు, రవి, మోయిజ్, అరుణ తదితరులు ఉన్నారు.