క్రైమ్/లీగల్

పోలీస్ స్టేషన్‌లపై దాడి ఘటనలో 130 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, నవంబర్ 6: అరకులోయ, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడి చేసిన ఘటనలో 130 మంది నిందితులను సిట్ బృందం గుర్తించింది. పోలీస్ స్టేషన్ల దాడిలో 76 మంది పాల్గొన్నట్టుగా ముందుగా భావించిన సిట్ బృందం మరింత లోతుగా విచారణ జరిపి మరికొంతమంది అదనంగా ఈ సంఘటనలో పాల్గొన్నట్టు నిర్థారించింది. అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు సెప్టెంబర్ 23వ తేదిన హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో రెచ్చిపోయిన నేతల అభిమానులు అరకులోయలోని పోలీస్ స్టేషన్లపై దాడికి ఎగబడ్డారు. స్టేషన్‌కు నిప్పు పెట్టడమే కాకుండా పలు రకాల వస్తువులను, వాహనాలను ధ్వంసం చేసారు. అంతేకాకుండా పోలీసులపై కూడా దాడికి యత్నించి ఒక కానిస్టేబుల్‌ను చితకబాదారు. ఈ సంఘటనపై సిట్ బృందం గత కొంతకాలంగా సుదీర్ఘ విచారణ చేపడుతూ పోలీసు స్టేషన్లపై దాడికి పాల్పడిన వారి వివరాలను సేకరించింది. తమ విచారణలో గుర్తించిన వారిపై కేసులు నమోదు చేసిన సిట్ బృందం ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన వారి కంటే ఇంకా అధికంగా ఈ సంఘటనలో పాల్గొన్నవారు ఉండడంతో నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లపై దాడి సందర్భంలో వందలాది మంది ఉన్నప్పటికీ వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోల ఆధారంగా ప్రత్యక్షంగా సంఘటనలో పాల్గొన్న వారిపై మాత్రమే కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినప్పటికీ వారిని అరెస్ట్ చేసేందుకు మాత్రం పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అరెస్ట్‌లతో కొత్త సమస్య ఏర్పడి అవకాశం ఉందని భావించి తొందరపడకుండా మొదటి విడతగా కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేసారు. అయితే మిగిలిన వారిలో పలువురు కీలకమైన వ్యక్తులు ఉండడంతో వీరి అరెస్ట్‌ల విషయమై పోలీసులు ఆలచోన చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరిలో నేర ప్రవృత్తి, వారి కేసుల వివరాలను సేకరించిన సిట్ బృందం ముందుగా ఎటువంటి ఇబ్బందులు లేవనకున్న వారిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారు మళ్లీ పోలీసుల జోలికి రాకుండా ఉండేలా కఠినమైన సెక్షన్‌లను విధించి కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిసింది. అరెస్ట్ చేయాల్సిన వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే ఈ అరెస్ట్‌ల తంతు ముగిసేందుకు మరో నెల రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.