క్రైమ్/లీగల్

టిమెట్ తిని చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, నవంబర్ 6: ఇంటిలో నానమ్మతో ఆట్లాడుకుంటూ ఇంట్లో కింద పడవేసిన టిమెట్ తిని చిన్నారి మృతి చెందిన సంఘటన బొమ్మనహాల్ మండలంలోని కలవళ్లితిప్పలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కలవళ్లితిప్ప గ్రామానికి చెందిన చిరంజీవి, గీతమ్మ దంపతుల కుమారుడు తేజ (03) టిమెట్ తిని మృతి చెందాడు. చిరంజీవి, గీతమ్మ మంగళవారం ఉదయం తన స్వంత పొలం పనుల కోసం వెళుతూ చిన్నారి తేజను నానమ్మతో వదిలి పొలంకు వెళ్లారు. నానమ్మతో ఆట్లాడుకుంటూ ఇంటిలో పడవేసిన టిమెట్‌ను తినడంతో చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చిన్నారి బంధువులు గమనించి చికిత్స కోసం పాల్తూరు ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తేజ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి తేజ మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదవశాత్తు రైలు నుండి జారిపడి యువకుడి మృతి

చెనే్నకొత్తపల్లి, నవంబర్ 6 : ప్రమాదవశాత్తు రైలు నుండి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. హిందూపురం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్నాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన షేక్ మహమ్మద్ ఛాంద్ (29) బెంగళూరులో హోటల్‌లో దిన కూలీగా పనిచేస్తుండేవాడు. అయితే పని నిమిత్తం రైలులో అనంతపురం వైపు వెళ్తున్నాడు. మంగళవారం ఉదయం యర్రంపల్లి గ్రామ సమీపానికి రాగానే కాలు జారి రైలులో నుంచి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. హిందూపురం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.

మహిళ అనుమానాస్పద మృతి

మడకశిర, నవంబర్ 6: మండల పరిధిలోని హెచ్‌ఆర్ పాళ్యంకు చెందిన శారద (43)లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత ఐదు రోజుల క్రితం శారద ఇంటి నుండి వెళ్లిపోయిందన్నారు. దీంతో భర్త ఓబుళప్ప, కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆమె కానరాలేదన్నారు. మంగళవారం ఉదయం పశువుల కాపర్లు హెచ్‌ఆర్ పాళ్యం అడవుల్లోకి పశువులను మేపడానికి వెళ్లగా ఓ చెట్టుకు శారద ఉరి వేసుకొన్న విషయాన్ని గమనించి మృతురాలి బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు ఎస్సై గోపీయాధవ్ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలి భర్త ఓబుళప్ప తన భార్యకు మతిస్థిమితం లేదన్నారు.