క్రైమ్/లీగల్

తెరాస నేత హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి: ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో నిశ్చితార్థం చేసిన విషయమై జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. సంఘటన పరిగిలో సంచలనం రేపింది. వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరిగి మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన మల్లయ్య అదే గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నేత నారాయణ రెడ్డి దగ్గర కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గ్రామంలోని యువతిని కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. అమ్మాయికి మరో వ్యక్తి కృష్ణతో పెద్దలు నిశ్చితార్థం చేశారు. విషయం తెలుసుకొని కృష్ణతో నిశ్చితార్థం ఎలా చేస్తారని మల్లయ్య గొడవకు దిగాడు. కృష్ణతో ఎందుకు గొడవకు దిగుతావాంటూ మల్లయ్య ఇంటికి అమ్మయి తల్లిదండ్రులు తాళం వేయగా నారాయణ రెడ్డి ఇంట్లో తలదాచుకున్నాడు. నిశ్చితార్థం జరిగిన కృష్ణ
సోమవారం రాత్రి వచ్చి నారాయణ రెడ్డి ఇంట్లో ఉన్న మల్లయ్యతో గొడవపడ్డాడు. నారాయణ రెడ్డి వర్గీయులు స్పందించి కృష్ణతో గొడవపడ్డారు. పరిగి పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలు ఒకరిపైఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో వ్యవసాయ పొలానికి బయలుదేరిన నారాయణ రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసి తలపై బండ రాయితో మోది హత్య చేశారు. హత్య జరిగిన వెంటనే నారాయణ రెడ్డి అనుచరులు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుభాష్ చందర్ రెడ్డి ఇంటికి వెళ్లి అతనిపై, తమ్ముడిపై రాళ్లతో దాడి చేశారు. సుభాష్‌చందర్ రెడ్డి తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. సుభాష్ చందర్ రెడ్డి, అతని తమ్ముడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఎస్పీ చేరుకుని కుటుంబీకులు, గ్రామస్థులతో మాట్లాడి వివరాలను సేకరించారు. నారాయణ రెడ్డి హత్యకు గురైన సంఘటన తెలిసి బాధిత కుటుంబాన్ని టీఆర్‌ఎస్ పరిగి అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి, నాయకుడు నాగిరెడ్డి పరామర్శించారు. పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణ రెడ్డి హత్యకు కారణాలను పూర్తిస్థాయిలో విచారణ జరిపి వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ అన్నపూర్ణ తెలిపారు.