క్రైమ్/లీగల్

డీఎస్పీ గన్‌మెన్ రాసలీలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: డీఎస్పీ గన్‌మెన్ రాసలీలలు బయటపడ్డాయి. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్తను సర్వీస్ గన్‌తో బెదిరించిన సంఘటన కలకలం రేపింది. సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా పూడూర్ గ్రామానికి చెందిన దంపతులు.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌కు వలసవచ్చి ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. డీఎస్పీ శిల్పవల్లి గన్‌మెన్‌గా రమేష్ పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 9 గంటలకు మహిళతో ఉండగా ఆమె భర్త గమనించాడు. రమేష్‌ను నిలదీయగా సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించే ప్రయత్నం చేశాడు. మహిళ భర్త అప్రమత్తమై ఇరుగుపొరుగు సహాయంతో తప్పించుకొని ఫిర్యాదు చేశారు. రమేష్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.