క్రైమ్/లీగల్

నిర్లక్ష్యానికి.. నిండు ప్రాణం బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, నవంబర్ 6: నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు విద్యుతాఘాతంతో మృతిచెందిన సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న వరంగల్ జిల్లా రాంపర్తి మండలంలోని సన్నూరు గ్రామానికి చెందిన చిన్నివాక ఎల్లయ్య వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో ఇక్కడే ఓ బిల్డర్ వద్ద ఉంటున్న ఎల్లయ్య కుమారుడు శేఖర్ (13) మంగళవారం ఉదయం ఆడుకుంటూ పక్కన ఖాళీగా ఉన్న గుడిసెలోకి వెళ్లాడు. లోపల పైన వేలాడి ఉన్న విద్యుత్ వైర్‌కు తగిలి విద్యుత్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు.ఇక్కడ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లలో కూలీలు ఉండేందుకు గుడిసెలు వేశారు. వీరికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. అనుమతి తీసుకుని ఇచ్చారా లేక అనుమతి లేకుండా ఇచ్చిన విద్యుత్ కనెక్షన్ ఎక్కడిదో కాని ఖాళీ చేసిన గుడిసెలో విద్యుత్ వైర్‌ను తొలగించకపోవడంతో నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది.